ఆర్‌బీఐ ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరవుతున్న పేటీఎం బాస్‌కు బంపరాఫర్‌!

12 Feb, 2024 18:41 IST|Sakshi

పేటీఎంపై ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మకు ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ బంపరాఫర్‌ ఇచ్చింది. ఆర్‌బీఐ ఒప్పుకుంటే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ అమితాబ్‌ చౌదరి ప్రకటించారు. 

‘వినియోగదారులు యూపీఐ పేమెంట్‌ కోసం పేటీఎంను వినియోగిస్తున్నారు. తద్వారా సంస్థ స్థూల విక్రయాల విలువ (గ్రాస్‌ మెర్చండైజ్‌ వ్యాల్యూ ) 75 శాతంగా ఉంది. సెంట్రల్‌ బ్యాంక్‌ అనుమతిస్తే పేటీఎంతో కలుస్తాం. వారితో కలిసి పని చేస్తాం’ అని అమితామ్‌ చౌదరి చెప్పారు.

 

పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ యూపీఐ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు ఏ బ్యాంక్‌తో కలిసి పనిచేయడం లేదు. కానీ ఆర్‌బీఐ పేటీంఎపై తీసుకున్న చర్యల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ యూపీఐ పేమెంట్స్‌పై దృష్టి సారించింది.


కలిసి పనిచేసేందుకు పేటీఎంతో చర్చలు జరుపుతోంది. అయితే, చర్చలు సాధారణ వ్యాపారం కోసమేనని, ఇతర కార్యకలాపాలకు సంబంధించినవి కావని ఆయన స్పష్టం చేశారు. మరి దీనిపై ఆర్‌బీఐ, పేటీఎం అధినేత విజయ్‌ శేఖర్‌ శర్మ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega