యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, కొత్త ఫండ్‌ చూశారా?

14 Nov, 2022 11:31 IST|Sakshi

హైదరాబాద్‌: యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా యాక్సిస్‌ నిఫ్టీ ఎస్‌డీఎల్‌ సెప్టెంబర్‌ 2026 డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్‌. నవంబర్‌ 16తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

నిఫ్టీ ఎస్‌డీఎల్‌ సెప్టెంబర్‌ 2026 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల ఆధారంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. దీర్ఘకాలిక కోణంలో 3-5 ఏళ్ల వ్యవధికి నాణ్యమైన డెట్‌ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు అనువైనది.   (పీఎన్‌బీ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌)

మరిన్ని వార్తలు