Menstruation app: కళ్లింత పెద్దవి చేసుకుని చూడొద్దు

10 Oct, 2021 12:00 IST|Sakshi

నేటితరం మానవుడు గంటల వ్యవధిలో స్పేస్‌లోకి అడుగుపెట్టి తిరిగి భూమిపైకి వస్తున్నాడు.అయినా సమాజంలో సె**,పీరియడ్స్‌ గురించి బాహాటంగా మాట్లాడలేని పరిస్థితి. పొరపాటున మాట్లాడినా,వాటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినా కళ్లింత పెద్దవి చేసుకుని చూస్తుండడం మనం తరుచూ గమనిస్తుంటాం.ఇలాంటి సమస్య ఇంట్లోవాళ్లకో, స్నేహితులకు ఎదురైతే ఏం చేస్తాం. మౌనంగా ఉండిపోతాం. కానీ ఈ చిన్నారి అలా అనుకోలేదు.తన స్నేహితురాలికి ఎదురైన ఇబ్బందులకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది. ఓ యాప్‌ను బిల్డ్‌ చేసి అందరి చేత శబాష్ అనిపించుకుంటోంది.

11ఏళ్ల చిన్నారి అయోషా గోయల్‌ గుజరాత్‌లోని అహమ్మాదాబాద్‌లో నివాసం ఉంటుంది.అయితే  ఓ రోజు పీరియడ్స్‌ సమయంలో తన స్నేహితురాలు శరీరంలో చోటు చేసుకున్న మార్పుల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఇబ్బంది పడింది. ఆ ఇబ్బందుల్లో నుంచి 'ఫ్రీ ఫ్లో' యాప్‌ ను బిల్డ్‌ చేసింది. ఈ యాప్‌లో మహిళ పిరియడ్స్‌ గురించి,  ట్రాకింగ్ పీరియడ్ డేట్స్‌, వెన్నునొప్పి, మొటిమలు,తిమ్మిరి ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు బోట్ ఫీచర్‌ను ఏర్పాటు చేసింది.  


ఈ సందర్భంగా అయోషా గోయల్‌ తల్లి షెలీజా మాట్లాడుతూ..రుతుస్రావం సమయంలో కుమార్తెలకు ఎలాంటి సహకారం అందించాలో ఈ యాప్‌ ద్వారా నాకు ప్రత్యక్షంగా అర్ధమైంది. ఇక యాప్‌ డిజైన్‌ విషయంలో గోయల్‌కు మెంటార్‌ పర్ణ మెహతా వ్యవహరించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో గోయల్‌కు సలహాలు, సూచనలు ఇచ్చింది.ఆమె తన స్నేహితులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సానుభూతి కలిగింది. వాటిని పరిష్కరించేందుకు 'ఫ్రీ ఫ్లో' యాప్ ను డెవలప్‌ చేసిందని చిన్నారిపై మెహాత ప్రశంశల వర్షం కురిపించారు.

చదవండి: సోషల్‌ మీడియాలో 'దమ్‌ మారో దమ్‌'..యువతకు చెక్‌ పెట్టేలా

మరిన్ని వార్తలు