బి న్యూలో దీపావళి ధమాకా ఆఫర్లు

2 Nov, 2021 09:08 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ సంస్థ బి న్యూ దీపావళి సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. మొబైల్, టీవీలు, లాప్‌ ట్యాప్‌లను భారీ తగ్గింపు ధరలతో అందిస్తున్నట్లు కంపెనీ ఎండీ వై.డీ. బాలాజీ చౌదరీ తెలిపారు. 

ఎంపిక చేసుకున్న సాంసంగ్‌ మోడళ్లపై రూ.5000 నుంచి రూ.30 వేల వరకు, వన్‌ ప్లస్‌ మోడళ్లపై రూ. 1,000 నుంచి రూ.6,000 వరకు, ఎంఐ మోడళ్లపై రూ.3000, రియల్‌ మి మోడళ్లపై రూ.3999 వరకు తగ్గింపు ధరల్ని ఇస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి నిఖిలేష్‌  పేర్కొన్నారు. ఎంఐ టీవీలపై రూ. 5000 డిస్కౌంట్‌తో పాటు రెండేళ్ల వారంటీ ఉంటుందనన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రిడెట్, కార్డులపై లాప్‌టాప్‌లను కొనుగోలు చేస్తే రూ.5000 వరకూ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఉంటుందన్నారు. కస్టమర్లు ఈ ఆ ఫర్లను వినియోగించుకోవాలని తెలిపారు.   
 

మరిన్ని వార్తలు