లింక్డిన్‌కు బ్యాడ్‌ న్యూస్‌: కొత్త ఫీచర్‌ ప్రకటించిన మస్క్‌

26 Aug, 2023 15:40 IST|Sakshi

ఇక ట్విటర్‌లోనూ ఉద్యోగాలు ,  ఎలాన్‌ మస్క్‌ హైరింగ్‌ ఫీచర్‌ 

స్పేస్‌ఎక్స్‌  అధినేత ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఎక్స్‌ (ట్విటర్‌) ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్‌కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్‌ ‘హైరింగ్‌’ను అధికారికంగా ప్రకటించింది.  లింక్డ్‌ఇన్‌, ఇండీడ్‌లాంటి సంస్థల తరహాలో ఎక్స్‌ కూడా కొత్త ఫీచర్‌నుతీసుకురానుందని వార్తలొచ్చిన నెల తరువాత సంస్థ ఎట్టకేలకు అధికారికంగా దీన్ని ధృవీకరించింది.  జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని ఇటీవల కొనుగోలు చేసిన సంగతి గమనార్హం. దీనిపై చాలామంది ఎక్స్‌ యూజర్లు సంతోషం  ప్రకటిస్తున్నారు.  ఆర్‌ఐపీ లింక్డ్ఇన్, ఇండీడ్‌ జిప్‌క్రూటర్, గ్లాస్‌డో అంటూ కమెంట్‌ చేశారు. (సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్‌ రిపోర్ట్‌)

ప్రస్తుతం బీటాలో ఉన్న హైరింగ్  ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌లో ఓపెన్ పాత్రలను పోస్ట్ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ధృవీకరించబడిన సంస్థలకు హైరింగ్ బీటా ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తొందరగా దీనికి సంబంధించిన లింక్‌ను కూడా ట్వీట్‌లో పొందు పర్చింది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ఎక్స్‌లో  (పరిమితంగా) ఉద్యోగులను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయి. ధృవీకరించిన  సంస్థలు తమ ప్రొఫైల్‌లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను  మాత్రం లిస్ట్‌ చేయవచ్చని తెలుస్తోంది.

కాగా గత నెలలో యాప్ పరిశోధకురాలు నిమా ఓవ్జీ జాబ్ లిస్టింగ్ ఫీచర్‌ను వివరించే స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత కంపెనీలతో జాబ్ సెర్చ్ ర్‌ ఫీచర్‌పై టెస్ట్ రన్ చేస్తోంది. 

మరిన్ని వార్తలు