250 కోట్ల బిగ్గెస్ట్‌ ప్రాపర్టీ డీల్‌: మాజీ ఛాంపియన్‌, బజాజ్‌ ఆటో చైర్మన్‌ రికార్డు

15 Mar, 2023 13:27 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం లగ్జరీ ఫ్లాట్లకు నెలవుగా మారుతోంది. ఈ నేపథ్యంలో  ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ నీరజ్‌ బజాజ్‌ ముంబైలో ఖరీదైన ఫ్లాట్లను కొనుగోలు చేశారు. బజాజ్ గ్రూప్ డైరెక్టర్ ఏకంగా రూ.252 కోట్లతో  మూడు  అంతస్తులను కొనుగోలు చేశారు. దీంతో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్‌కు బజాజ్‌ ఓనర్‌గా అవతరించారు.

ఇదే ముంబైలో అతిపెద్ద డీల్‌గా భావిస్తున్నారు. మాక్రోటెక్ డెవలపర్స్ నుండి బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ 252.5 కోట్ల రూపాయలకు సీ-ఫేస్‌డ్‌ ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. దక్షిణ ముంబైలోని వాల్కేశ్వర్‌లో 18వేల చదరపు అడుగుల ట్రిప్లెక్స్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీగా డీల్ స్టాంప్ డ్యూటీ రూ.15 కోట్లు. 29, 30, 31వ అంతస్తులతోపాటు, ఎనిమిది పార్కింగ్‌లను కూడా నీరజ్‌ కొనుగోలు చేశారు. 31 అంతస్తులున్న లోధా మలబార్ ప్యాలెస్ ప్రాజెక్ట్‌ ఒక్కో ఫ్లాట్‌ కనీస పరిమాణం దాదాపు 9,000 చదరపు అడుగులు. ఒక్కో అపార్ట్‌మెంట్ ధర రూ. 100 కోట్లకు పైమాటే ప్రస్తుతం బజాజ్ ముంబైలోని పైదార్ రోడ్డులో 50 ఏళ్ల నాటి భవనంలోని రెండు అంతస్తుల్లో కుటుంబం నివసిస్తోంది. 

నీరజ్ బజాజ్ ఎవరు?
రాహుల్ బజాజ్ మరణానంతరం బజాజ్ గ్రూప్‌ను ముందుండి నడిపిస్తున్న 69 ఏళ్ల నీరాజ్ బజాజ్ఆ సియా అత్యంత సంపన్నులలో ఒకరు. 2021లో గ్రూప్ ఛైర్మన్ అయిన నీరజ్‌కు 35 సంవత్సరాల కార్పొరేట్ అనుభవం ఉంది. బజాజ్ పల్సర్‌తో సహా అనేక ప్రసిద్ధ ద్విచక్ర వాహనాలను తయారు చేసే బజాజ్ ఆటో, అలాగే బజాజ్ అలయన్జ్ , జనరల్ ఇన్సూరెన్స్‌లో డైరెక్టర్ల బోర్డులో కూడా ఉన్నారు. 

మూడు సార్లు టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌, 17 ఏళ్లకే అర్జున అవార్డు
మూడు సార్లు జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ అయిన నీరజ్ బజాజ్ 1977లో ఆట నుండి రిటైర్ అయ్యారు. అప్పటికి ఆయన వయసు కేవలం 22 సంవత్సరాలు. ఇది సోదర వర్గానికి మరియు అతని స్వంత కుటుంబానికి కూడా షాక్ ఇచ్చింది. బజాజ్, అయితే టేబుల్ టెన్నిస్ జీవితకాల సాధన కాబోదు అందుకే కుటుంబ వ్యాపారంలో చేరాలనుకుంటున్నట్లు స్పష్టంగా నీరజ్‌ ప్రకటించారు.పారిశ్రామికవేత్తల కుటుంబంలో ప్రపంచస్థాయి క్రీడాకారుడుగా రాణించడం చాలా అరుదు అనే ఘనతను దక్కించుకున్నారు. 17ఏళ్లకే నీరాజ్ బజాజ్ 1974లో అర్జున అవార్డు గెల్చుకున్నారు.  అలాగే  ప్రమోటర్‌గా  ప్రపంచంలోనే తొలి టేబుల్ టెన్నిస్ ఫ్రాంచైజీ  అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)ని ప్రారంభించారు.

1970-77 మధ్య ఏడు సంవత్సరాలు టేబుల్ టెన్నిస్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాదు. నాలుగు సార్లు  నంబర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌ ర్యాంక్  సాధించారు. నీరజ్‌ భార్య మినాల్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కృతి, నీరవ్ బజాజ్ ఉన్నారు. నీరజ్‌కు ఇద్దరు సోదరులు. మధుర్ , శేఖర్ బజాజ్‌ వీరిలో నీరజ్ చిన్న. ఫోర్బ్స్ ప్రకారం 2022  నాటికి ఈ సోదరుల నికర  సంపద  దాదాపు రూ. 65000 కోట్లు.

1954లో జన్మించిన నీరజ్‌ కేథడ్రల్  అండ్‌ జాన్ కానన్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత ముంబైలోని సిడెన్‌హామ్ కాలేజీ నుండి కామర్స్ అండ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండిఎంబీఏ పట్టాను పొందారు నీరజ్‌ నేతృత్వంలోని గ్రూపులో 50000 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.4,50,000 కోట్లు.

అల్ట్రా-లగ్జరీ ప్రాపర్టీ సేల్స్‌ జోరు
కోవిడ్‌ తరువాత గత రెండేళ్లుగా అల్ట్రా-లగ్జరీ ప్రాపర్టీల అమ్మకాలు పెరిగాయి. ఇండిపెండెంట్‌ నాన్-బ్రోకరేజీ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ కంపెనీ లియాసెస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ తెలిపారు. రెసిడెన్షియల్ యూనిట్లను కొనుగోలు చేయడానికి దీర్ఘకాలిక మూలధన పన్ను మినహాయింపు ఏప్రిల్ 1, 2023 నుండి రూ. 10 కోట్లకు పరిమితం కానుందని బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో  మార్చి 31కి ముందు లగ్జరీ యూనిట్ల అమ్మకాలు పెరుగుతాయని ముందే చెప్పామని మరో నిపుణుడు అభిషేక్ కిరణ్ గుప్తా అన్నారు. ఏప్రిల్ 1నుంచి పాలసీ మారుతున్న క్రమంలో లగ్జరీ గృహాలను కొనుగోలు చేసేవారికి ఇంకా 15 రోజుల సమయం ఉందన్నారు. 

ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ తర్వాత  నీరజ్‌  బజాజ్‌  కొనుగోలుమూడో అతిపెద్ద ప్రాపర్టీ డీల్‌ అని  మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. డీమార్ట్ యజమానిరాధాకిషన్ దమానీ, అతని ఫ్యామిలీ ఒబెరాయ్ రియల్టీలో 28 యూనిట్లను బల్క్‌గా  కొనుగోలు చేశారు. అలాగే గత నెలలో (ఫిబ్రవరి 8,) వెల్‌స్పన్‌ గ్రూప్‌నకు చెందిన బీకే గోయెంకా అదే లగ్జరీ ప్రాజెక్ట్‌లో రూ.240 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు