బజాజ్‌ ఆటో లాభం 71 శాతం అప్‌..

28 Oct, 2021 06:27 IST|Sakshi

క్యూ2లో రూ. 2,094 కోట్లు

న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం బజాజ్‌ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,094 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,194 కోట్లతో పోలిస్తే ఇది 71 శాతం అధికం. ఇక ఆదాయం రూ. 7,442 కోట్ల నుంచి రూ. 9,080 కోట్లకు చేరింది. కేటీఎం ఏజీలో 46.5 శాతం వాటాలను పీరర్‌ బజాజ్‌ ఏజీలో 49.9 శాతం వాటా కోసం తమ అనుబంధ సంస్థ బజాజ్‌ ఆటో ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ మార్పిడి చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితో సుమారు రూ. 501 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం 11,44,407 వాహనాలు విక్రయించింది. గత క్యూ2లో విక్రయించిన 10,53,337 యూనిట్లతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదు చేసింది.  

మరిన్ని వార్తలు