బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లాభం రూ.62 కోట్లు

9 Nov, 2022 08:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, ఉపకరణాల తయారీ దిగ్గజం బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.62 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.62.5 కోట్లు నమోదు చేసింది. 

టర్నోవర్‌ 6.81 శాతం తగ్గి రూ.1,159 కోట్లుగా ఉంది. కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఆదాయం 2.45 శాతం తగ్గి రూ.883 కోట్లు, లైటింగ్‌ సొల్యూషన్స్‌ విభాగం 3.73 శాతం క్షీణించి రూ.276 కోట్లు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ సెగ్మెంట్‌ 39.4 శాతం పడిపోయి రూ.67 కోట్లకు వచ్చి చేరింది. ఆర్డర్‌ బుక్‌ అక్టోబర్‌ 1 నాటికి రూ.1,554 కోట్లు ఉందని కంపెనీ వెల్లడించింది. క్రితం ముగింపుతో పోలిస్తే బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ షేరు ధర బీఎస్‌ఈలో మంగళవారం 0.47 శాతం పెరిగి రూ.1,158.55 వద్ద స్థిరపడింది.  

మరిన్ని వార్తలు