సీఐఐ ప్రెసిడెంట్‌గా సంజీవ్‌ బజాజ్‌

13 May, 2022 06:30 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్‌గా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సీఎండీ సంజీవ్‌ బజాజ్‌ బాధ్యతలు స్వీకరించారు. 2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యనభ్యసించారు. బోర్డ్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), అలియాంజ్‌ ఎస్‌ఈ ఇంటర్నేషనల్‌ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. సీఐఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఆర్‌.దినేశ్‌ నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు