నెలకు రూ.890 కడితే శామ్‌సంగ్ ఫ్రిజ్‌ మీ సొంతం!

30 May, 2021 20:05 IST|Sakshi

మీరు కొత్త ఫ్రిజ్‌ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? మీ దగ్గర సరిపడినంత డబ్బులు లేవా? అయితే మీకు శుభవార్త. ఒకేసారి డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేనివారు కోసం బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్ కస్టమర్లకు మంచి డీల్ అందిస్తోంది. శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ని అందిస్తోంది. మీరు నెలకు రూ.890 చెల్లించి శాంసంగ్ ఫ్రిజ్‌ను కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్ ఫ్రిజ్‌లలో డిజిటల్ ఇన్వర్టర్స్, ఆల్‌రౌండ్ క్లీనింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. కస్టమర్లకు కన్వర్టిబుల్ 5-ఇన్ -1 మోడల్స్, సింగిల్ డోర్, డబుల్ డోర్ ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి.

శామ్‌సంగ్ 212 లీటర్ల 5 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ కొనాలనుకుంటే ఈఎంఐ రూ.890గా ఉంది. అలాగే 198 లీటర్ల 5 స్టార్ సింగిల్ ఫ్రిజ్ కొంటే ఈఎంఐ రూ.1000 కట్టాల్సి ఉంటుంది. 198 లీటర్ల 3 స్టార్ సింగిల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.1025 ఈఎంఐ కట్టాలి. 386 లీటర్ల 2 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.2333 ఈఎంఐ పడుతుంది. ఫ్రిజ్ కొనాలనుకునే వారు బజాజ్ ఈఎంఐ స్టోర్‌‌లోకి లాగిన్ అయి కొనుగోలు చేయవచ్చు.

3 నుంచి 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఢిల్లీ, పూణే, ముంబై, థానే, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ఈ సదుపాయం ఉంది. ఈఎంఐ స్టోర్ హైపర్‌లోకల్ షాపింగ్ మోడల్‌ను కలిగి ఉంది. మీరు ఆన్‌లైన్‌ ద్వారా శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్‌ను ఆర్డర్ చేసిన రెండు లేదా మూడు రోజుల్లో మీ ఇంటికి డెలివరీ చేయనున్నారు.

చదవండి: వన్‌ప్లస్ నార్డ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు