బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సేల్స్‌ ఢమాల్‌

22 Jul, 2021 07:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 833 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,215 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,192 కోట్ల నుంచి రూ. 13,949 కోట్లకు బలహీనపడింది. సొంత అనుబంధ సంస్థలు బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ అలయెంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్, బజాజ్‌ అలయెంజ్‌ లైఫ్‌ ల ఉమ్మడి పనితీరుతో వెల్లడించిన ఫలితాలివి.   
ఫైనాన్స్‌ ఓకే: అనుబంధ సంస్థలలో బజాజ్‌ ఫైనాన్స్‌ నికర లాభం 4 శాతంపైగా ఎగసి రూ. 1,002 కోట్లను తాకగా.. జనరల్‌ ఇన్సూరెన్స్‌ లాభం 8.4 శాతం క్షీణించి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఇక లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగం లాభం 35 శాతం పైగా వెనకడుగుతో రూ. 84 కోట్లకు చేరింది. 

మరిన్ని వార్తలు