-

ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!

29 Dec, 2021 16:39 IST|Sakshi

పూణే: ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన సత్తా ఏంటో చూపించేందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ సిద్దం అవుతుంది. పూణేలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్ ఏర్పాటు కోసం ₹300 కోట్ల(40 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రకటించింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 5,00,000 ఎలక్ట్రిక్ వాహనలను ఉత్పత్తి  చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ పేర్కొంది. ఈ ప్రదేశం(అకుర్ది, పూణే)లోనే బజాజ్ అసలు చేతక్ స్కూటర్ తయారు చేశారు. పూణేలోని తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారంలో 'అత్యాధునిక రోబోటిక్, ఆటోమేటెడ్' తయారీ వ్యవస్థలను మోహరించనున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. 

లాజిస్టిక్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఫ్యాబ్రికేషన్ & పెయింటింగ్, అసెంబ్లీ & క్వాలిటీ అస్యూరెన్స్ నుంచి ప్రతిదీ ఆటోమేటెడ్ అని తెలిపింది. ఈ తయారీ కర్మాగారం అర మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం సుమారు 800 మంది సిబ్బందిని నియమించుకుంటున్నట్లు తెలిపింది.  ఈ పెట్టుబడికి అదనంగా రూ.250 కోట్ల పెట్టుబడిని పెట్టడానికి ఇన్వెస్టర్లు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్ నుంచి మొదటి వాహనం జూన్ 2022 నాటికి బయటకు వస్తుందని సంస్థ భావిస్తుంది. ఇతర సంస్థలకు పోటీగా మరిన్ని వాహనాలను లాంచ్ చేసేందుకు సంస్థ సిద్దం అవుతుంది.

(చదవండి: పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 రాయితీ..!)

మరిన్ని వార్తలు