‘సింగపూర్‌లో చపాతీల కోసం భారతీయుల కటకట!’

27 Sep, 2022 15:28 IST|Sakshi

సింగపూర్‌ పంజాబీలకు చపాతీ కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఈ ఏడాది మే నెల నుంచి భారత్‌ గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది.  ముఖ్యంగా సింగపూర్‌ వంటి దేశాల్లో నార్త్‌ ఇండియా నుంచి ఎగుమతయ్యే గోధుమల రవాణా తగ్గిపోయింది. దీంతో ఆ గోధుమలతో తయారు చేసిన చపాతీలు లభ్యం కాకపోవడంతో వాటిని అమితంగా ఇష్టపడే పంజాబీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

మూడు రెట్లు ఎక్కువే  
ఉక్రెయిన్‌ - రష్యా సంక్షోభం కారణంగా విదేశాల్లో గోధుమల కొరత తీవ్రంగా ఏర్పడింది. అవసరానికి అనుగుణంగా గోధుమలు లేకపోవడం, వాటిని ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో ఉన్న భారత్‌ ఎగుమతుల్ని నిలిపివేయడంతో సింగపూర్‌లో భారతీయులకు చపాతీల కొరత ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఆ చపాతీ పిండి కొనుగోలు చేయాలంటే భారత్‌తో పోలిస్తే మూడింతలు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిపోతున్న ధరల భారాన్ని  వినియోగదారులపై మోపడం కష్టంగా ఉందని సింగపూర్‌లో ఐదు రెస్టారెంట్‌ అవుట్‌ లెట్స్‌ నిర్వహిస్తున్న శకుంతలా రెస్టారెంట్‌ ప్రతినిధులు చెబుతున్నారు.  

కష్టంగా ఉంది
సింగపూర్‌లో కేజీ గోధుమ పిండిని 2డాలర్లు చెల్లించే కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అదే కేజీ గోధుమ పిండి ధర 8డాలర్లకు చేరింది. గోధుమ పిండిని అధిక మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయడం కష్టంగా మారిందని పంజాబీ, బెంగాల్ వంటలకు ప్రసిద్ధి చెందిన మస్టర్డ్‌ సింగపూర్‌ రెస్టారెంట్‌ యజమాని రాధిక అబ్బి తెలిపారు.

మరిన్ని వార్తలు