బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

24 Nov, 2022 08:39 IST|Sakshi

ముంబై:  గృహ రుణ రేటును పరిమిత కాలానికి పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ప్రకటించింది. దీనితో ఈ రేటు 8.25 శాతానికి తగ్గింది.  తాజా రేటు 2022 డిసెంబర్‌ 31 వరకూ అమల్లో ఉంటుందని కూడా పేర్కొంది. అయితే ఈ ప్రత్యేక రేటు రుణ గ్రహీతల క్రెడిట్‌ ప్రొఫైల్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.  

ప్రాసెసింగ్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.  తగ్గించిన రుణ రేటు బ్యాంకింగ్‌ రంగంలో అతి తక్కువ గృహ రుణ రేటులో ఒకటని, అత్యంత పోటీ పూర్వకమైనదని బ్యాంక్‌ పేర్కొంది. తాజా రేటు తగ్గింపు తాజా గృహ రుణాలతో పాటు, బ్యాలెన్స్‌ బదలాయింపులకూ వర్తిస్తుందని తెలిపింది. ‘‘ఈ ఏడాది మేము గృహ రుణ విభాగంలో మంచి వృద్ధి రేటును చూశాం. అన్ని పట్టణాల్లో పటిష్ట డిమాండ్‌ ఉంది.  మా తాజా నిర్ణయం రుణ వృద్ధి మరింత పెరగడానికి దోహదపడుతుంది’’ అని బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ (తనఖాలు, ఇతర రిటైల్‌ రుణాలు) హెచ్‌టీ సోలంకీ తెలిపారు. 

మరిన్ని వార్తలు