పండుగ సీజన్‌లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది!

13 Sep, 2023 09:39 IST|Sakshi

ఇప్పటికే దేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. కేవలం ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే కాకుండా.. కొన్ని దిగ్గజ బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ బాటలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వడ్డీ & ఇతర రాయితీలను అందించనుంది.

  • హోమ్ లోన్ మీద వడ్డీ రేటు ఇప్పుడు 8.4శాతం నుంచి ప్రారంభమవుతుంది
  • బ్యాంక్ ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్‌డ్ రేట్ కార్ లోన్‌ల వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.70 శాతం నుంచి ప్రారంభమవుతాయి, దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేవు
  • ఎజ్యుకేషన్ లోన్ మీద వడ్డీ రేటు 8.55 శాతం నుంచి ప్రారంభమవుతుంది (60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు)
  • పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. వడ్డీ 10.10 శాతం నుంచి ప్రారంభమవుతుంది (80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు)

ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలే..

ఈ ఏడాది చివరి వరకు.. అంటే 2023 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్స్ కింద బ్యాంక్ విద్య & వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను వరుసగా 60 bps, 80 bps తగ్గించింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే కొన్ని ఇతర బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ప్రత్యేక ఆఫర్స్ పొందవచ్చు.

మరిన్ని వార్తలు