బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫెస్టివల్‌ బొనాంజా ఆఫర్లు..!

16 Sep, 2021 18:23 IST|Sakshi

త్వరలో రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాదారులకు  రిటైల్ లోన్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్‌ హోమ్‌లోన్స్‌, కార్‌లోన్స్‌కు వర్తించనుంది. హోమ్‌లోన్స్‌, కార్‌లోన్స్‌కు వర్తించే  వడ్డీరేట్లపై సుమారు 0.25 శాతం మాఫీని ఆఫర్‌ చేస్తుంది. అంతేకాకుండా హోమ్‌లోన్స్‌పై ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపును కూడా అందిస్తోంది. గృహ రుణాలు 6.75 శాతం నుంచి , కారు రుణాలు  7.00శాతం నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతాయి.
 (చదవండి: Gpay: గూగుల్‌ పే భారీ అవకతవకలు!)

కస్టమర్లు  బాబ్ వరల్డ్ మొబైల్‌ యాప్స్‌ ద్వారా కూడా సులభంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ సందర్భంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జీఎమ్‌ హెచ్‌.టీ. సోలంకీ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్‌లో రిటైల్ లోన్ ఆఫర్లను ప్రవేశపెట్టడంతో కస్టమర్లకు తమ బ్యాంకు తరపునుంచి పండుగ ఉత్సాహాన్ని అందించాలని భావిస్తున్నామన్నారు. బ్యాంక్ కస్టమర్లకు కొత్త రుణాలు అందించడం కోసం గృహ రుణాలు,  కారు రుణాలపై ఆకర్షణీయమైన ప్రతిపాదనతో బీవోబీ ముందుకు వచ్చిందన్నారు. తక్కువ వడ్డీరేట్లకు కస్టమర్లు రుణాలను పొందవచ్చునని పేర్కొన్నారు. ఆయా రుణాలకు ప్రాసెసింగ్‌ ఫీజు నుంచి కూడా మినహయింపు వస్తుందని తెలిపారు. 

చదవండి: SBI Home Loan: పండుగ సీజన్​ రాకముందే ఎస్​బీఐ ఆఫర్ల వర్షం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు