బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డిపాజిట్‌ రేట్ల పెంపు

18 Mar, 2023 03:20 IST|Sakshi

ముంబై: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వివిధ కాల వ్యవధి కలిగిన రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లు, ఎన్‌ఆర్‌వో, ఎన్‌ఆర్‌ఈ టర్మ్‌ డిపాజిట్లపై పావు శాతం మేర వడ్డీ రేట్లను పెంచినట్టు ప్రకటించింది. ఈ రేట్లు మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.

60 ఏళ్లు నిండిన వృద్ధులకు 0.25–0.35 శాతం వరకు అధిక రేటును ఆఫర్‌ చేస్తోంది. మూడు నుంచి ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్లపై రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. 5––10 ఏళ్ల డిపాజిట్‌పైనా ఇదే రేటు ఆఫర్‌ చేస్తోంది. బరోడా అడ్వాంటేజ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు 3–5 ఏళ్ల కాలానికి, 5–10 ఏళ్ల కాలానికి 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగాయి. 

మరిన్ని వార్తలు