బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీ వాటాల విక్రయం

11 Mar, 2023 04:38 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవో బీ) తన సబ్సిడరీ అయిన బీవోబీ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఎల్‌)లో 49 శాతం వరకు వాటాలను విక్రయించనుంది. ఇందుకు సంబంధించి బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది.

బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీకి ప్రస్తుతం 100 శాతం వాటా కలిగి ఉంది. అర్హత కలిగిన ఇన్వెస్టర్లు, వ్యూహాత్మక భాగస్వాముల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు కోరుతూ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని బీవోబీ తెలిపింది.  

మరిన్ని వార్తలు