వీడియో కేవైసీని ప్రవేశపెట్టిన బీవోబీ

23 Aug, 2023 06:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) వీడియో ఆర్‌ఈ కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్లు ఎప్పటికప్పుడు తమ కేవైసీ ధ్రువీకరణ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం బ్యాంక్‌ శాఖ వరకు రావాల్సిన అవసరాన్ని వీడియో ఆర్‌ఈ కేవైసీ విధానం నివారిస్తుంది. వీడియో కేవైసీ సదుపాయం వినియోగించుకోవాలంటే కస్టమర్‌ వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి.

భారతీయ పౌరసత్వం కలిగి, ఆధార్, పాన్‌ ఉండాలని బీవోబీ తెలిపింది. ముందుగా కస్టమర్లు బీవోబీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌ ఆర్‌ఈ–కేవైసీ దరఖాస్తును సమరి్పంచాలి. ఇందులో అడిగిన వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌కు వీడియో కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్‌ కంటే ముందు కస్టమర్‌ తన ఒరిజినల్‌ పాన్‌ కార్డ్, ఖాళీ వైట్‌ పేపర్, బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌ సిద్ధంగా ఉంచుకోవాలి. వీడియో ఆర్‌ఈ కేవైసీ కాల్‌ను అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు