విద్యార్థులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు!

25 May, 2021 20:45 IST|Sakshi

విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉన్నత చదువులు చదివేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఎడ్యుకేషన్ లోన్స్‌పై 6.75 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందిస్తోంది. బ్యాంక్‌బజార్ తెలిపిన సమాచారం ప్రకారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం వడ్డీరేటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.85 శాతంగా వడ్డీరేటు ఉంది.

భారతదేశం, విదేశాలలో ఉన్నత చదువుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. విద్యా రుణాలు తీసుకునే వారికి సెక్షన్ 80ఈ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ కోసం, మీ జీవిత భాగస్వామి లేదా పిల్లలకు విద్యా రుణం తీసుకున్నట్లయితే చెల్లించే వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే రెండు బెనిఫిట్స్ లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని భావిస్తే.. లేదంటే విదేశాల్లో చదివించాలని భావిస్తే.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. 

చదవండి:

ఎస్‌బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు

మరిన్ని వార్తలు