దివాళీ బొనాంజా: బ్యాంకులు బంపరాఫర్లు.. కస్టమర్లకు పండగే!

23 Oct, 2022 12:41 IST|Sakshi

కస్టమర్లకు బంపరాఫర్‌. దీపావళి సందర్భంగా కొత్త ఇల్లు, కారు కొనాలని అనుకుంటున్నారా? లేదా ఇల్లు రెనోవేట్‌ చేయాలని అనుకుంటున్నారా? భారీగా పెరిగిన వడ్డీరేట్ల నుంచి ఉపశమనం దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసిఐసిఐ,ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు పరిమిత కాలానికి లోన్‌ ఆఫర్‌లను ప్రకటించాయి. 

ఎస్‌బీఐ గృహ రుణాలను సంవత్సరానికి 8.4 శాతం నుండి టాప్-అప్ రుణాలను 8.8 శాతం నుండి అందిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా సంవత్సరానికి 8.45 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. 8.45 శాతం నుండి కార్ లోన్‌లను అందిస్తుంది. కారు రుణాలపై ఎలాంటి ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలు లేవు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంవత్సరానికి 7.9 శాతం చొప్పున కారు లోన్‌లను అందిస్తోంది. 50 శాతం పూర్తయిన తర్వాత (కనీసం 24 నెలలు) ఎలాంటి ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలు లేవు. బంగారం రుణాలపై, ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం మాఫీ చేసింది. 

ఐసీఐసీ బ్యాంక్ ప్రస్తుతం కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను అందిస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను చెక్‌ చేసిన తర్వాత, ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లను మంజూరు చేస్తుంది. కారు రుణాలపై, ప్రాసెసింగ్ రుసుము రూ. 1,999, కొత్త కారు రుణాలపై ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ మొత్తాలను అందిస్తుంది. కార్ లోన్‌లపై ఫోర్‌క్లోజర్, ప్రీపేమెంట్ ఛార్జీలు లేవు. వ్యక్తిగత రుణాలపై 12 ఈఎంఐల తర్వాత ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు (12ఈఎంఐల కంటే ముందు ఫోర్‌క్లోజర్‌ చేస్తే 3 శాతం వసూలు చేస్తాయి).

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పండుగ సీజన్‌లో పీఎన్‌బీ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022 అనే పేరుతో  గృహ రుణాలు, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 7.50 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. తిరిగి చెల్లించే వ్యవధి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కార్ లోన్‌లను అందిస్తుంది. ఇది సంవత్సరానికి వడ్డీ 7.65 శాతం నుండి ప్రారంభమవుతుంది. కారు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులు లేవు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పండుగ సీజన్‌లో గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
 
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలను 8.30 శాతం నుండి, కారు రుణాలను 8.70 శాతం నుండి అందిస్తోంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేసింది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఏడేళ్ల వరకు కార్ లోన్‌లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో కార్లను కొనుగోలు చేసేలా 100 శాతం వరకు ఫైనాన్స్ అందిస్తోంది. సాధారణంగా, బ్యాంకులు కారు రుణం 80-85 శాతం వరకు ఫైనాన్సింగ్‌ను అందిస్తాయి. ఇది 72 నెలల వరకు రూ. 50 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఇతర ప్రముఖ బ్యాంకులతో పోలిస్తే, బ్యాంక్ ఎక్కువ కాలం పాటు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. గరిష్ట రుణ మొత్తం ఎక్కువగా ఉంటుంది. గృహ రుణాల కోసం 30ఏళ్ల వరకు సుదీర్ఘ కాల వ్యవధిని అందిస్తోంది.

మరిన్ని వార్తలు