గౌతమ్‌ థాపర్‌పై ఛార్జ్‌షీట్‌

5 Jan, 2023 12:07 IST|Sakshi

న్యూఢిల్లీ: సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్,  ఆ సంస్థ మాజీ ప్రమోటర్‌ గౌతమ్‌ థాపర్‌పై సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.  రూ. 2435 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఈ ఛార్జ్‌షీట్‌ దాఖలైంది.  12 బ్యాంకులపై ఈ బ్యాంకింగ్‌ మోసం ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు.  

కంపెనీ, థాపర్‌ ఇతర సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లపై బ్యాంక్‌ నిధుల మళ్లింపు, ఖాతా పుస్తకాలను తారుమారు తదితర ఆరోపణలపై ఏజెన్సీ దాదాపు 19 నెలల పాటు విచారణ జరిపిన తర్వాత ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేయడం జరిగింది. అవినీతి, మోసం ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసిన యస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో సంబంధాలపై థాపర్‌ ఇప్పటికే పలు విచారణలను ఎదుర్కొంటున్నారు.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్‌ టికెట్‌ కోసం క్యూలో నిలబడక్కర్లేదు! 

మరిన్ని వార్తలు