డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ హాలిడేస్‌..! ఎన్నంటే..!

27 Nov, 2021 20:26 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ హాలిడేస్‌ను ప్రకటించింది. ఆర్బీఐ ప్రకటనలో దేశంలో ఆయా ప్రాంతాల వారీగా డిసెంబర్‌ నెలలో మొత్తం 12రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది.  

ఇక ప్రతి నెలలో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే..డిసెంబర్‌లో మొత్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ 12 రోజులలో..6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6  సెలవులు ఆయా ప్రాంతాల్లో స్పెషల్ హాలిడేస్ ఆధారంగా ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  6 రోజులు సాధారణ సెలవులు మాత్రమే ఉండనున్నాయి. 

డిసెంబర్ నెలలో బ్యాంక్ హాలీడేస్‌ను ఒకసారి చూద్దాం 

డిసెంబర్ 3.. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా పనాజీలో బ్యాంక్‌ హాలిడే
డిసెంబర్ 5 - ఆదివారం (సెలవు)
డిసెంబర్ 11- శనివారం (నెలలో రెండవ శనివారం)
డిసెంబర్ 12- ఆదివారం (సెలవు)
డిసెంబర్ 18- యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంక్‌ హాలిడే)
డిసెంబర్ 19- ఆదివారం (సెలవు)
డిసెంబర్ 24- క్రిస్మస్ పండుగ (ఐజ్వాల్‌లో బ్యాంక్‌ హాలిడే)
డిసెంబర్ 25- క్రిస్మస్ పండుగ, శనివారం(నెలలో నాల్గవ శనివారం)
డిసెంబర్ 26- ఆదివారం (సెలవు)
డిసెంబర్ 27- క్రిస్మస్ వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంక్‌ హాలిడే)
డిసెంబర్ 30- యు కియాంగ్ నోంగ్‌బా (షిల్లాంగ్‌లో బ్యాంక్‌ హాలిడే)
డిసెంబర్ 31- నూతన సంవత్సర వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంక్‌ హాలిడే)

మరిన్ని వార్తలు