Bank Holidays December 2022:13 రోజులు సెలవులు

18 Nov, 2022 11:00 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆర్‌బీఐ డేటా ప్రకారం డిసెంబర్‌ నెలలో బ్యాంకులు 13 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. డిసెంబర్‌లో వచ్చే  రెండు, నాలుగు శనివారాలు   4 ఆదివారాలతో  పాటు  రిజర్వ్‌ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంది. బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చెక్  చేసుకొని దాని కనుగుణంగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌.  డిసెంబర్‌లో 3,4,10,11,18,24,25 తేదీల్లో  దేశవ్యాప్త  సెలవు. అలాగే డిసెంబర్ 24న, క్రిస్మస్, నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో  ఉంటాయి. 


డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులు:
డిసెంబర్ 3 - శనివారం (సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ , గోవాలో హాలిడే)
డిసెంబర్ 4 -ఆదివారం
డిసెంబర్ 10- రెండో శనివారం 
డిసెంబర్ 11 -ఆదివారం
డిసెంబర్ 12- సోమవారం (పా టాగన్ నెంగ్మింజ సంగం, మేఘాలయలో సెలవు)
డిసెంబర్ 18 - ఆదివారం
డిసెంబర్ 19 - సోమవారం (గోవా లిబరేషన్‌ డే,గోవాలో సెలవు)
డిసెంబర్ 24- శనివారం ( క్రిస్మస్, నాలుగో శనివారం  దేశవ్యాప్త సెలవు) 
డిసెంబర్ 25 - ఆదివారం
డిసెంబర్ 26- సోమవారం (క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్  మిజోరం, సిక్కిం, మేఘాలయలో  హాలిడే)
డిసెంబర్ 29- గురువారం (గురు గోవింద్ సింగ్‌ పుట్టినరోజు,చండీగఢ్‌లో  హాలిడే)
డిసెంబర్ 30- శుక్రవారం ( యు కియాంగ్ నంగ్వా  మేఘాలయలో సెలవు
డిసెంబర్ 31 - శనివారం (నూతన సంవత్సర వేడుకలు, మిజోరంలో సెలవు)

రాష్ట్రాల పండుగల ఆధారంగా  అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. 

మరిన్ని వార్తలు