రానున్న అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధికంగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
(RBI Penalty: బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా)
అక్టోబర్ సెలవుల జాబితాలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు 7 ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. పండుగ లేదా గెజిట్ హాలిడేస్ 11 ఉన్నాయి. వీటిలో కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. మరికొన్ని రాష్ట్రానికి రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా ఉండవచ్చు.
(గడువు ముగియనున్న ఎల్‌ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ)
అక్టోబర్ నెల ప్రారంభంలోనే మొదటి రెండు రోజులు వరుసుగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం కాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 24న దసరా కారణంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా చాలా బ్యాంకులు మూతపడనున్నాయి.
అక్టోబర్ సెలవుల జాబితా ఇది..