యూపీఐ ట్రాన్సాక్షన్​ ఫెయిలైతే.. రూ.100 నష్టపరిహారం

7 Apr, 2021 20:14 IST|Sakshi

ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టిన రోజు(ఏప్రిల్ 1) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూసివేయబడ్డాయి. బ్యాంకుల మూసివేత కారణంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో ఎన్ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంతో చాలా మంది వినియోగదారుల డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఫెయిల‌య్యాయి. కొన్ని సందర్భాలలో క‌స్ట‌మ‌ర్ అకౌంట్‌ల‌లో క‌ట్ అయిన డబ్బులు బెనిఫిషియ‌రీ ఖాతాలో జమ కావడం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ట్రాన్స‌క్ష‌న్ ఫెయిల్ అయితే సదురు ఖాతాలో తిరిగి అమౌంట్ రీ ఫండ్ అవ్వాలి. ఒక‌వేళ అమౌంట్ రీఫండ్ కాక‌పోతే బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 1న చాలా మంది క‌ట్ అయిన డబ్బులు  తిరిగి జమ కాలేదు అని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎన్​పీసీఐ వివరణ ఇస్తూ ట్వీట్​ చేసింది. “మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు, ఏప్రిల్​1వ తేదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే రోజు.. కాబట్టి ఈ రెండు రోజులు బ్యాంకుల సర్వర్లు డౌన్​ అయినట్లు పేర్కొంది. తర్వాత సేవలను పునరుద్దరించినట్లు" పేర్కొంది. సెప్టెంబర్20, 2019న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణీత కాలపరిమితిలో లావాదేవీల పరిష్కారం, డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం వంటివి జరిగితే బ్యాంకు ఆ వినియోగదారుడికి పరిహారం చెల్లించాలి. యూపీఐ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేస్తే.. డబ్బులు చెల్లించేవరకు ప్రతిరోజు రూ.100 పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం.. యూపీఐ ట్రాన్సక్షన్ విఫలమై.. కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయితే టీ+1 రోజుల్లో డబ్బులు తిరిగి ఖాతాలో జమచేయాలి.

చదవండి: 

ఈ స్కోడా కారుపై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్​!

>
మరిన్ని వార్తలు