బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల సమ్మె,వారానికి 5 రోజులే పనిచేస్తాం!

13 Jun, 2022 15:14 IST|Sakshi

ప్రైవేట్‌ ఉద్యోగస్థుల తరహా పనివేళలు తమకు ఉండాలని జూన్‌ 27న 9 బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇదే విషయంపై గత కొన్నేళ్లుగా విన్నపాలు వినిపిస్తున్నా తమను ఎవరు పట్టించుకోవడం లేదని బ్యాంక్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

ప్రైవేట్‌ ఉద్యోగస్తులు సోమవారం నుంచి శుక్రవారం వరకు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తారు. శనివారం, ఆదివారం కుటుంబ సభ్యులతో గడుపుతుంటుంటారు. ఇప్పుడీ ఈ పని విధానాన్ని బ్యాంక్‌ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 7 ఏళ్లుగా వారానికి 5 రోజుల పనిదినాల్ని అమలు చేసేలా బ్యాంక్‌ స్టేక్‌ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నట్ల తెలిపారు. వర్కింగ్‌ డేస్‌ను కుదించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంతోపాటు వారి వర్క్‌లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవచ్చన్నారు. అయితే ఆ చర్చలు విఫలమవుతున్నాయని, కానీ ఈనెల 27 జరిగే సమ్మెలో తమ డిమాండ్‌ను ఉధృతం చేస్తామని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ (ఏఐబీఈఏ) సీహెచ్‌ వెంకటా చలం తెలిపారు. 

ఈ సందర్భంగా వెంకటా చలం మాట్లాడుతూ జూన్‌ 27న సుమారు 9 లక్షల మంది బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రొటెస్ట్‌లో ఐదురోజుల పనిదినాల అమలుతో పాటు మరికొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచుతామని పేర్కొన్నారు. 

బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు 2015 నుంచి వారానికి 5 రోజుల పని దినాల్ని కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. శనివారం, ఆదివారం సెలవు కావాలని కోరుతున్నాయి. ఉద్యోగులు సెలవు దినాల్లో తప్ప శనివారం రోజు పనిచేస్తున్నారు. అరె ఇప్పటి వరకు మా విన్నపాన్ని ఎవరు పట్టించుకోలేని చెప్పారు.    

మేం ఏ పాపం చేశాం
విదేశాల్లో బ్యాంక్‌ ఉద్యోగులు షిఫ్ట్‌లు వైజ్‌గా వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ మన దేశానికి చెందిన బ్యాంక్‌ ఉద్యోగులు వారానికి 6రోజులు పనిచేస్తున్నారని నేషనల్‌ కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ (ఎన్‌సీఈబీ) జనరల్‌ సెక్రటరీ బండ్లీష్‌ మేం ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్బీఐ సైతం 5 వర్కింగ్‌ డేస్‌  
బ్యాంక్‌లు మినిహాయిస్తే ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్బీఐ, ఎల్‌ఐసీ సంస్థ ఉద్యోగులు సైతం వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు. కానీ మేం (బ్యాంక్‌ ఉద్యోగులు)  మాత్రం 6 రోజులు పనిచేస్తున్నాం. భారత్‌ను బలమైన ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు డిజిటల్‌ ఇండియా అందుబాటులోకి వచ్చింది. ఆ వ్యవస్థను ఆసరగా చేసుకొని వివిధ పద్దతుల్లో బ్యాంక్‌ కార్యకాలాపాల్ని అందించవచ్చు. అందుకే బ్యాంక్‌ ఉద్యోగులు వారానికి 5 రోజులకు పనిదినాల్ని కుదించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు బండ్లీష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు