రెండు రోజులు బ్యాంకింగ్‌ సమ్మె! 

10 Feb, 2021 13:16 IST|Sakshi

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు  బ్యాంకుల నిరసన

మార్చి 15, 16 తేదీలలో సమ్మె

సాక్షి, న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ, మార్చి 15 నుంచీ రెండు రోజుల పాటు  సమ్మె నిర్వహించాలని తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య సంస్థ యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) మంగళవారం బ్యాంకింగ్‌కు పిలుపునిచ్చింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో.. తాము మార్చి 15 నుంచి సమ్మె చేయనున్నట్లుగా యూఎఫ్‏బీయూ స్పష్టం చేసింది.

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి 1న తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది. 2019లో ఈ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్‌ఐసీకి విక్రయించింది. అలాగే గడచిన నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు