కొన్ని గంటల్లో ఈ బ్యాంక్‌ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి!

21 Sep, 2022 13:03 IST|Sakshi

సాక్షి,ముంబై: మరి కొన్ని గంటల్లో దేశంలో మరో బ్యాంకు మూతపడనుంది. ఖాతాదారులు తమ డిపాజిట్లను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచిస్తోంది. అదే పూణేకు చెందిన రూపే కో-ఆపరేటివ్‌ బ్యాంకు. బ్యాంకు మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పూణేలోని రూపే కో ఆపరేటివ్‌బ్యాంకు మూసివేయాలని ఆగస్టులోనే  ఆర్‌బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 22న బ్యాంక్ మూసివేయబడుతుందని కస్టమర్‌లకు ముందుగానే సమాచారం అందించారు. 

బ్యాంకు సజావుగా పనిచేయడానికి మూలధనం లేక, లాభదాయకంగా మారడానికి ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడంతో ఆర్థిక సంక్షోభంలోపడింది. ఆ తర్వాత ఆర్‌బీఐ లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయంతో గడువు లోపు తమ సొమ్మును తీసుకోకపోతే డిపాజిటర్లు తమ డబ్బును పోగొట్టుకుంటారా? బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు.  అంటే  రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.  అలాగే డీఐసీజీసీ బ్యాంకు ఖాతాదారులకు బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది.
 

>
మరిన్ని వార్తలు