బ్యాంక్స్‌, ఆటో దన్ను- లాభాలతో షురూ

4 Aug, 2020 09:33 IST|Sakshi

సెన్సెక్స్‌ 258 పాయింట్లు అప్‌

37,198 వద్ద ట్రేడింగ్‌

75 పాయింట్లు బలపడి 10,967కు చేరిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ఓకే

రెండు రోజుల వరుస అమ్మకాల తదుపరి దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 258 పాయింట్లు ఎగసి  37,198కు చేరగా.. నిఫ్టీ 75 పాయింట్లు పుంజుకుని 10,967 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరగడంతో మార్కెట్లు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఆటో  అప్
ఎన్‌ఎస్‌ఈలో అన్ని ప్రధాన రంగాలూ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, హీరో మోటో, ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, మారుతీ, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఐషర్‌, ఎల్‌అండ్‌టీ 3.4-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇండస్‌ఇండ్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌, టాటా మోటార్స్‌ 1.3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఎక్సైడ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎక్సైడ్‌ 6 శాతం జంప్‌చేయగా.. వోల్టాస్‌, కేడిలా, ముత్తూట్‌, ఐడియా, అమరరాజా, కాల్గేట్‌ పామోలివ్‌3-1.6 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఉజ్జీవన్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, పీఎన్‌బీ, బెర్జర్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎంజీఎల్‌ 2-0.5 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1038 లాభపడగా.. 322 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు