బ్యాంకింగ్‌ హవా- మార్కెట్లకు పుష్

28 Aug, 2020 15:56 IST|Sakshi

354 పాయింట్లు అప్‌-39,467కు సెన్సెక్స్‌

88 పాయింట్లు పెరిగి 11,648 వద్ద నిలిచిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో  బ్యాంక్‌ నిఫ్టీ 4.2 శాతం హైజంప్‌

బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్స్‌ అప్‌- స్మాల్‌ క్యాప్స్‌ వీక్‌

ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు సెప్టెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు సైతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 354 పాయింట్లు జంప్‌చేసి 39,467 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు ఎగసి 11,648 వద్ద నిలిచింది. మరోసారి హషారుగా ప్రారంభమైన మార్కెట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో రోజంతా పటిష్టంగా కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,580 వద్ద గరిష్టాన్ని తాకగా..  39,235 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 11,686- 11,589 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. వరుసగా ఐదో రోజు గురువారం యూఎస్‌ ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ సరికొత్త గరిష్టం వద్ద నిలవడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. 

ఇండస్‌ఇండ్‌ స్పీడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్‌ ఇండెక్సులు 5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి.  మీడియా 1.8 శాతం లాభపడగా.. ఆటో, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 0.8-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌ 12 శాతం దూసుకెళ్లగా..  యాక్సిస్‌, యూపీఎల్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్‌, ఎయిర్‌టెల్, జీ, టెక్‌ మహీంద్రా 8-2 శాతం మధ్య ఎగశాయి. అయితే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటో, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, శ్రీ సిమెంట్‌, సిప్లా 3-1 శాతం  మధ్య క్షీణించాయి.

ఐడియా దూకుడు
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా, ఎన్‌ఎండీసీ, కెనరా బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, పీవీఆర్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, భెల్‌, బీవోబీ, పీఎన్‌బీ, ఐడిఎఫ్‌సీ ఫస్ట్‌, ఆర్‌బీఎల్‌ 15-4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క అశోక్‌ లేలాండ్‌, హావెల్స్‌, డీఎల్‌ఎఫ్‌, టీవీఎస్‌ మోటార్‌, భారత్‌ ఫోర్జ్‌, పిడిలైట్‌, టొరంట్‌ ఫార్మా, అపోలో టైర్‌, ఎక్సైడ్‌, ఎస్కార్ట్స్‌ 3-1.3 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.5 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1278 లాభపడగా.. 1614 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,164 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 809 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు 1,581 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  డీఐఐలు రూ. 1,195 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  

మరిన్ని వార్తలు