బ్యాంకుల హవా- మార్కెట్ల హైజంప్

19 Oct, 2020 16:00 IST|Sakshi

449 పాయింట్లు అప్‌-40,432కు సెన్సెక్స్‌

111 పాయింట్లు ఎగసి 11,873 వద్ద ముగిసిన నిఫ్టీ

బ్యాంకింగ్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ జోరు

ఫార్మా, మీడియా, ఆటో, ఐటీ రంగాలు డీలా

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం ప్లస్‌

వారాంతాన కనిపించిన జోష్‌ కొనసాగడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి లాభాల దౌడు తీశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో రోజంతా సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల మార్క్‌ ఎగువనే కదిలింది. చివరికి 449 పాయింట్లు జమ చేసుకుని 40,432 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 111 పాయింట్లు జంప్‌చేసి 11,873 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,519 వద్ద, నిఫ్టీ 11,898 వద్ద గరిష్టాలను తాకాయి. ఫిబ్రవరికల్లా కోవిడ్‌-19 నుంచి దేశం బయటపడే వీలున్నట్లు వెలువడిన అంచనాలు, లాభాలతో కదులుతున్న విదేశీ మార్కెట్ల కారణంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణలు పేర్కొన్నారు.

ఆటో బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ 3.15 శాతం జంప్‌చేయగా.. మెటల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. ఫార్మా, మీడియా, ఆటో, ఐటీ 1.7- 0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, నెస్లే, గెయిల్‌, యాక్సిస్‌, ఎస్‌బీఐ, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బీపీసీఎల్‌, ఐటీసీ, హిందాల్కో, హెచ్‌యూఎల్‌ 5.2-1.6 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే దివీస్‌, ఐషర్‌, హీరో మోటో, సిప్లా, బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా 3.6-0.5 శాతం మధ్య క్షీణించాయి.

ఫార్మా వీక్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో బీవోబీ, ఫెడరల్‌ బ్యాంక్‌, భెల్‌, జిందాల్‌ స్టీల్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, హెచ్‌పీసీఎల్‌, పిడిలైట్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, అదానీ ఎంటర్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, బంధన్‌ బ్యాంక్‌, కాల్గేట్‌ 8.2-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు నౌకరీ, జూబిలెంట్‌ ఫుడ్‌, గ్లెన్‌మార్క్‌, లుపిన్‌, టొరంట్‌ ఫార్మా, బయ్కాన్‌, వొల్టాస్‌, సన్‌ టీవీ 3.3-2.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,489 లాభపడగా.. 1,172 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 480 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 430 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వెరసి గత వారం ఎఫ్‌పీఐలు నికరంగా 1,186 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 5,217 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. 

>
మరిన్ని వార్తలు