బ్యాంక్స్‌ వీక్‌- 40,000 దిగువకు సెన్సెక్స్‌

28 Oct, 2020 13:31 IST|Sakshi

542 పాయింట్లు పతనం -39,980కు

134 పాయింట్ల నష్టంతో 11,755కు నిఫ్టీ

బ్యాంకింగ్‌, రియల్టీ, ఐటీ 2-1 శాతం వీక్‌

40,664 వద్ద ఇంట్రాడే గరిష్టానికి సెన్సెక్స్‌

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం డౌన్‌

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌కల్లా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 550 పాయింట్లు పతనమైంది. 40,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం 542 పాయింట్లు కోల్పోయి 39,980 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 134 పాయింట్ల నష్టంతో 11,755 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో సెన్సెక్స్‌ 40,664 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకడం గమనార్హం! ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ ఇండెక్స్‌ 2 శాతం నీరసించగా.. రియల్టీ, ఐటీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజ 1.7-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. 

ఎయిర్‌టెల్‌ అప్‌
నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇంఢ్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, శ్రీసిమెంట్‌ 3-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎయిర్‌టెల్‌, హీరో మోటో, యూపీఎల్‌, టాటా మోటార్స్‌, విప్రో, మారుతీ, ఎంఅండ్‌ఎం 4-0.5 శాతం మధ్య ఎగశాయి. డెరివేటివ్స్‌లో డీఎల్‌ఎఫ్‌, అపోలో టైర్‌, అమరరాజా, ఐబీ హౌసింగ్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, మైండ్‌ట్రీ 4.2-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. వేదాంతా, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, బాలకృష్ణ, వోల్టాస్‌, సీమెన్స్‌ 3.2- 1.4 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1500 నష్టపోగా 942 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు