బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్‌..!

24 Mar, 2022 19:52 IST|Sakshi

మీకేమైనా బ్యాంకులో పనులు ఉంటే వెంటనే చేసి పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే వచ్చే ఆరు రోజుల్లో 4 రోజులకు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 మధ్య బ్యాంకులు నాలుగు రోజుల పాటే పనిచేయనున్నాయి. 

బ్యాంకు ఉద్యోగుల సమ్మె..!
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బ్యాంకు  ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు.  మార్చి 28, 29 (సోమ, మంగళ ) వారాల్లో రెండు రోజుల సమ్మెను ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.  కాగా సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.  ఎస్‌బీఐ తమ శాఖలు, కార్యాలయాల్లో పనులను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తామని, సమ్మె కారణంగా ఇక్కడి పనులపై కొంత మేర ప్రభావం ఉండవచ్చునని  పేర్కొంది.  బ్యాంకులు సమ్మెలో ఉన్నప్పుడు ఖాతాదారులకు బ్యాంకు బ్రాంచ్‌లో లభించే సేవలకు అంతరాయం కలుగుతుంది.

మిగతా రోజుల్లో..!
బ్యాంకు ఉద్యోగుల సమ్మె తరువాత కేవలం రెండు రోజుల పాటు మాత్రమే బ్యాంకులు నడవనున్నాయి. మార్చి 30, 31 రోజున బ్యాంకులు యథావిధిగా తమ కార్యకలాపాలను జరపనున్నాయి.ఏప్రిల్‌ 1 న అన్యువల్‌ క్లోజింగ్‌ కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్‌ 2 న తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా బ్యాంకులకు సెలవు. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. బ్యాంకులతో నేరుగా సంబంధం లేని లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లాంటి ట్రాన్సాక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.

చదవండి: క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వాడుతున్నా‍రా..! అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌..!

మరిన్ని వార్తలు