బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌...! ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు

13 Jul, 2021 15:55 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: ఈ నెలలో మీకు ఏమైనా బ్యాంకులో పనులు ఉంటే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఈ నెలలో పలు ప్రాంతాల్లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవులు ఆయాప్రాంతాల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలను ప్రభావితం చేయనున్నాయి.  బ్యాంకుల ద్వారా జరిపే ముఖ్యమైన లావాదేవీలను వెంటనే జరుపుకుంటే మీకే మంచింది.  బ్యాంకులకు సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయిస్తుంది. బ్యాంకులకు సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మూడు రకాలుగా నిర్ణయిస్తుంది. నెగోషియేబుల్‌ ఇన్స్‌స్ట్రూమెంట్‌ యాక్ట్‌, రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ హాలిడే, బ్యాంకుల ఖాతాల ముగింపు.

జూలైలో పలు నగరాల్లో బ్యాంకు సెలవు దినాలు ఇవే...
జూలై 12 -జగన్నాథ రథయాత్ర
జూలై 13- భాను జయంతి(సిక్కింలో సెలవు)
జూలై 14- ద్రుక్పా త్చేచి(సిక్కింలో సెలవు)
జూలై 16- హారేలా ఫెస్టివల్‌(ఉత్తారఖండ్‌)
జూలై 17- తీరథ్‌ సింగ్‌ డే/ ఖార్చి పూజ
జూలై 18- ఆదివారం
జూలై 19- గురు రింపోచే తుంగ్కర్ షెచు, (షిల్లాంగ్‌లో సెలవు)
జూలై 20- బక్రీద్‌ (జమ్మూ, కొచ్చి)
జూలై 21- బక్రీద్‌(దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
జూలై 24- నాల్గవ శనివారం
జూలై 25- ఆదివారం
జూలై 31- కెర్ పూజ(త్రిపుర)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు