ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిల మాఫీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

14 Dec, 2022 06:54 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు మాఫీ(రైటాఫ్‌) చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  రైటాఫ్‌ అనేది రుణ గ్రహీతలకు ఎలాంటి లబ్ధి చేకూర్చదని నిర్మలా సీతారామన్‌ తేల్చిచెప్పారు. వారి నుంచి రుణాలను వసూలు చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను (రైటాఫ్‌ లోన్లు) తిరిగి చెల్లించాల్సిందేనని వివరించారు. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.6,59,596 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేశాయని, ఇందులో రూ.1,32,036 కోట్ల మేర రైటాఫ్‌ లోన్లు ఉన్నాయని తెలియజేశారు.

ఇదీ చదవండి: గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు

మరిన్ని వార్తలు