BGMI టీజ‌ర్ విడుద‌ల‌: గేమ్‌ను 2060లో విడుద‌ల చేస్తావా ఏంటి?!

5 Jun, 2021 10:09 IST|Sakshi

ప‌బ్జీ గేమ్.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) పేరుతో  భార‌త్‌లో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  గేమ్‌ను డిజైన్ చేసిన క్రాఫ్ట‌న్ సంస్థ ప్రీ-రిజిస్ట్రేష‌న్లు, అప్డేట్స్‌, దానికి సంబంధించిన ఓ టీజ‌ర్ విడుద‌ల చేయడంతో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే గేమింగ్ ల‌వ‌ర్స్ ఆస‌క్తికి అనుగుణంగా స‌ద‌రు సంస్థ గేమ్‌ను విడుద‌ల చేయ‌డంతో విఫలమైందంటూ  గేమింగ్ ప్రియులు పెదవి విరుస్తున్నారు.  

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా రానున్న ప‌బ్జీ గేమ్ ను ఆడేందుకు ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే భార‌త్లో ఈ గేమ్‌ను విడుద‌ల చేసేందుకు ప‌బ్జీ మాతృసంస్థ క్రాఫ్ట‌న్ సంస్థ ప్ర‌తినిధులు గేమ్‌ను రీ డిజైన్ చేసి విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా ప్రి రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప్రారంభింభించారు. దీంతో గేమ్ ల‌వ‌ర్స్ భారీ ఎత్తున రిజిస్ట్రేష‌న్ చేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. అయితే ఈ టీజ‌ర్ విడుద‌లతో గేమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఆడేందుకు గేమింగ్ ప్రియులు ప్ర‌య‌త్నించారు. కానీ ఆ గేమ్ ఇన్‌స్టాల్‌ చేసే ఆప్ష‌న్ లేక‌పోవ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

‘సంస్థ అధికారిక యూట్యూబ్ ఛాన‌ల్‌ కామెంట్ సెక్ష‌న్‌లో ప్రి రిజిస్ట్రేష‌న్లు భారీ స్థాయిలో చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం చేసుకోవ‌డం కాదు.. గేమ్ ఇన్‌స్టాల్‌ చేసుకునే ఆప్షన్‌ను కూడా క్రియేట్ చేయాలి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు 2060 సంవ‌త్స‌రం అయినా క్రాఫ్టన్ సంస్థ  బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ప్రి రిజిస్ట్రర్ నౌ అని ప్ర‌చారం చేసుకుంటుందని ట్రోల్‌ చేస్తున్నారు. కాగా, ప్ర‌ముఖ ప‌బ్జీ గేమ్ మొబైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సాగర్ ఠాకూర్  ఇటీవల ప‌బ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ విడుదల తేదీని ప్ర‌క‌టించి విషయం తెలిసిందే. జూన్ 18న విడుదల కానుంద‌ని బైన‌రీ కోడ్ ద్వారా ఆయన వెల్ల‌డించారు.

మరిన్ని వార్తలు