Battle Ground Mobile India Review: అదరగొట్టిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్(పబ్‌జీ)

20 Jun, 2021 16:19 IST|Sakshi

గేమింగ్‌ ప్రియులకు పబ్‌జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్‌జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పబ్‌జీ మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్‌. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత కారణాల రీత్యా బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. బ్యాన్‌ విధించినప్పటికీ వీపీఎన్‌ సౌలత్‌తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అయితే, పబ్‌జీ మరో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో అనేక ఆటంకాలు దాటుకొని జూన్ 18న విడుదల అయ్యింది. అయితే, దశల వారీగా ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది.

ఎంతో మంది గేమింగ్‌ ప్రియులు చాలా కాలం ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. దీంతో ఇప్పుడు వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ఎలా ఉంది? పబ్‌జీ మించి ఉంటుందా? లేక అప్పటి లాగే ఉంటుందా? అని ఆతృతతో ఉన్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సైజ్ వచ్చేసి 700 ఎంబీ, అదనపు డేటా 1.77జీబీ. కాబట్టి, మీ స్మార్ట్ ఫోన్ లో మీకు అంత స్థలం ఉంటేనే ఇన్స్టాల్ అవుతుంది.

చిరాకు తెప్పిస్తున్న హెచ్చరికలు
క్రాఫ్ట్టన్ సెటప్ ప్రక్రియను చాలా ఎక్కువగా ఉంది. ఇది వాస్తవానికి గేమర్ల గోప్యత గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది కానీ, వాస్తవానికి అదేమీ ఉండదు. ఉదా: మీరు 18 సంవత్సరాల కంటే పెద్దవారా లేదా అని మిమ్మల్ని అడుగుతుంది. అయితే, ఇందులో దానిని ధృవీకరించడానికి ఇన్ గేమ్ ప్రక్రియ అంటూ ఏమి లేదు. అదేవిధంగా, గేమ్ అడుతున్నప్పుడు రెగ్యులర్ ఆడియో హెచ్చరికలు వస్తున్నాయి. అది మీకు చాలా చిరాకు, కోపం తెప్పిస్తుంది. మీరు గేమ్ ఆడటం ప్రారంభించిన తర్వాత, అదే స్వరంతో ఎక్కువ గంటలు ఆడకూడదని మీకు గుర్తు చేస్తుంది. మీరు మ్యాచ్ ప్రారంభించిన ప్రతిసారీ ఇలానే జరుగుతుంది. ఆటగాళ్ళు ఒక నిర్దిష్ట సమయం ఆడిన తర్వాత ఈ హెచ్చరికలు వస్తే బాగుండేది.

ప్లేయర్ డేటాను బదిలీ చేయవచ్చు
ఇందులో మంచి విషయం ఏమిటంటే, మీరు పాత ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లే ఖాతా ద్వారా లాగిన్ అయితే డేటాను పబ్‌జీ నుంచి బదిలీ చేసుకోవచ్చు. ఈ గేమ్ ఇప్పుడు అల్ట్రా హెచ్ డీ, యుహెచ్ డీతో సహా చాలా గ్రాఫిక్స్ ఆప్షన్ ని అందిస్తుంది. నేను రెండు సార్లు గేమ్ ఆడిన రెండు సందర్భాలలో వెయిటింగ్ రూమ్ 45 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. అదే సాధారణంగా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అయితే మొబైల్ లో 70 నుంచి 90 సెకన్ల మధ్య ఉంటుంది.

సుపరిచితమైన గేమ్ ప్లే
గేమ్ ప్లే విషయానికి వస్తే, లొకేషన్ లు, గ్రాఫిక్స్ మొత్తం పబ్‌జీ మొబైల్ తరహాలోనే ఉంటుంది. మ్యాప్ కూడా పబ్‌జీ  తరహాలోనే ఉంటుంది. దీనిలో భారతదేశంలోని నిర్ధిష్ట లొకేషన్ లు లేవు. ఇందులో మొదటి ప్రధాన మార్పు ఏమిటంటే గేమ్ లో ఎరుపుకు బదులుగా ఆకుపచ్చ రంగులో రక్తాన్ని చూపిస్తుంది. రంగులను మార్చుకోవచ్చు కానీ, ఎరుపు మాత్రం కాదు. అలాగే, ఆటగాళ్లు కాల్చినప్పుడు రక్తానికి బదులుగా ఆకుపచ్చ రంగులో చూపిస్తుంది.

అలాగే, మీరు ఒక ఆటగాడిని కోల్పోతే, 'కిల్'కు బదులుగా పూర్తయింది అని వస్తుంది. ఈ గేమ్ ఆట టెన్సెంట్ వెర్షన్ నుంచి క్రాఫ్ట్టన్ తనను తాను వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను ఎంఐ 11 అల్ట్రాలో ఈ గేమ్ అడినప్పుడు ఎటువంటి అంతరాయం కలగలేదు. మొత్తానికి మాత్రం మనం పబ్‌జీ గేమ్ ఆడిన అనుభూతి మాత్రమే వస్తుంది. వేరే గేమ్ ఆడిన అనుభూతి రాదు. మీరు ఈ గేమ్ అడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఈ క్రింద కామెంట్ చేయండి.

చదవండి: రైలు ప్రయాణికులకు ఐఆర్​సీటీసీ శుభవార్త!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు