పాన్ అప్డేట్ అంటూ సందేశాలు.. క్లిక్ చేస్తే అకౌంట్‌‌లో డబ్బులు మాయం!

25 Mar, 2023 08:24 IST|Sakshi

ఆధార్ అప్డేట్, పాన్ కార్డు అప్డేట్ వంటివి వినియోగదారులు ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇటీవల కొంతమంది అప్డేట్ యువర్ పాన్ అనే సందేశంతో కొన్ని ఫేక్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటిపై క్లిక్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశిస్తోంది.

గత కొన్ని రోజులుగా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పేరుతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో కొన్ని ఫేక్ మెసేజిలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇవి నకిలీ సందేశాలైనప్పటికీ @TheOfficialSBI అనే పేరుతో రావడం గమనార్హం. ఇందులో మీ పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు అకౌంట్ నిలిచిపోతుందని ఉంటుంది. దీనికి భయపడి కొంతమంది దానిపైన క్లిక్ చేసి సైబర్ దాడులకు బలైపోతున్నారు.

ఇలాంటి ఫేక్ సందేశాలపై ఎవరూ క్లిక్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరించింది. SBI ఎప్పుడూ మీ పర్సనల్ డీటైల్స్, అకౌంట్ వివరాలు సందేశాల ద్వారా అడగదు, కావున వినియోగదారుడు తప్పకుండా వీటిని గమనించి జాగ్రత్త వహించాలి.

ఇదిలా ఉండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కూడా ఫేక్ మెసేజస్ వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్‌ల ప్రీ అప్రూవల్ కోసం కేవైసీ డాక్యుమెంట్స్ కావాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి వచ్చినట్లుగా ఈ మెసేజ్ వైరల్ అవుతోంది. దీనిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పంపించలేదని, దానికి ఎవరూ స్పందించవద్దని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు