టెక్‌ కంపెనీ సీఈవో, ఎండీ జంట హత్యలు: షాకింగ్‌ వీడియో వైరల్‌

13 Jul, 2023 15:01 IST|Sakshi

సంచ‌ల‌నం సృష్టించిన బెంగుళూరు జంట హ‌త్య‌ల కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఈ హ‌త్య‌ల‌తో సంబంధం ఉంద‌ని అనుమానిస్తున్న వ్యక్తులు ఘటన తర్వాత పారిపోతున్న వీడియో ఇపుడు సంచలనంగా మారింది.  పీటీఐ దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్‌  చేసింది.

బెంగళూరులోని ఏరోనిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో జంట హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ గురువారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. జూలై 11న సాయంత్రం 4:14 గంటలకు మొదటి సీసీటీవీ విజువల్‌లో, ముగ్గురు నిందితులు ఏరోనిక్స్ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తుతూ కెమెరాకు చిక్కారు. నిందితులు సంతోష్, వినయ్ రెడ్డి ఆఫీసు గేటు నుంచి బయటకు వస్తుండగా, ప్రధాన నిందితుడు శ‌బ‌రీష్ అలియాస్ జాక్ ఫిలిక్స్ కనిపించారు .క‌న్న‌డ ర్యాప‌ర్‌గా చెప్పుకునే ఫిలిక్స్‌కు ఇన్‌స్టాలో 16 వేల మంది ఫాలోయిర్స్ ఉన్నారు.  (హెచ్‌సీఎల్‌ చేతికి జపాన్‌...279 మిలియన్‌ డాలర్ల డీల్‌)

వాట్సాప్‌ స్టేట‌స్ పెట్టి మ‌రీ హ‌త్య  
పోలీసుల ద‌ర్యాప్తులో విస్తుపోయే ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. ‘‘త‌న బిజినెస్‌కు ఇబ్బందిగా మారిన చెడ్డ‌వారిని శిక్షిస్తా..ఈ ప్ర‌పంచం మొత్తం మోస‌గాళ్లు,  ఫేక్‌ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తే వారితో నిండిపోయింది. నేను ఈ భూమిపైనే వారిని శిక్షిస్తాను. మంచివారిని ఎప్పుడూ ఏమీ చేయ‌ను” అంటూ వాట్సాప్ స్టేష‌న్ పెట్టినట్టు తెలుస్తోంది. 

కాగా ఎఫ్ఐఆర్ ప్రకారం ఎయిర్‌నిక్స్ ఎండీ  ఏళ్ల ఫణీంద్ర సుబ్రమణ్య (36), ఆ తర్వాత సీఈవో విను కుమార్‌ (40)పై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ముగ్గురు అనుమానితులు శబరీష్ , సంతోష్  వినయ్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు

మరిన్ని వార్తలు