బ్యాగ్‌ తారుమారు...ఇండిగోకు చుక్కలు చూపించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌..!

1 Apr, 2022 13:21 IST|Sakshi

రోడ్డు, ట్రైన్‌ ప్రయాణాలు చేసినంత సులువుగా విమాన ప్రయాణాలు ఉండవు. విమానంలో వెళ్లాలంటే విమానశ్రయంలో సెక్యూరిటి, బోర్డింగ్‌ పాస్‌ చెకింగ్‌ ఇలా సవాలక్ష  చెకింగ్స్‌ చూసుకున్న తరువాతనే ఎయిర్‌లైన్‌ బోర్డింగ్‌కు అనుమతినిస్తాయి. ఇక మన దగ్గర పరిమితికి మించి లగేజ్‌ ఉంటే మాత్రం అంతే సంగతులు..! దానికి అదనంగా కొత్త డబ్బు చెల్లించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన లగేజ్‌ను తీసుకోవడం కూడా అంతా ఈజీ కాదు..! కొన్ని సార్లు ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికుల లగేజ్‌ను వేరే గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. కాగా తాజాగా  బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఇలాంటి సంఘటన ఎదురైంది. తన బ్యాగ్‌ మిస్సవ్వడంతో ఎయిర్‌లైన్స్‌కు చుక్కలు చూపించాడు. 

బ్యాగులు తారుమారు..!
పాట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బ్యాగ్‌ తారుమారు కావడంతో కంపెనీ వెబ్‌సైట్‌ను హ్యక్‌ చేశాడు. ఎయిర్‌లైన్స్‌ కస్టమర్‌కేర్‌ నుంచి సరైన సహకారం రాక పోవడంతో తన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ ప్రతిభతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌ హ్యక్‌ గురయ్యేలా చేశాడు. ఈ విషయాన్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నందకుమార్ ట్విట్టర్లో వెల్లడించాడు.  
 

మార్చి 27 న నందన్‌ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించగా..ఆయన లగేజీను పొరపాటున​ సహా ప్రయాణికుడు తీసుకెళ్లాడు. తన బ్యాగు తారుమారైందని ఇంటికి వెళ్లాక గమనించాడు నందన్‌. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కస్టమర్‌ కేర్‌ సిబ్బందిని సంప్రదించగా వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. తన బ్యాగ్ ను పట్లుకెళ్లిన వ్యక్తికి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి ఎయిర్‌లైన్స్‌ ముందుకు రాలేదు. దీంతో @IndiGo6E  వెబ్ సైట్‌లోకి దూరి రికార్డులను పరిశీలించి తనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించాడు. సదరు ప్రయాణికుడి వివరాలతో తన బ్యాగును వెంటనే తెప్పించుకున్నాడు.

స్పందించిన ఇండిగో..!
నందన్‌ తన బ్యాగ్‌ను సంపాదించుకోవడమే కాకుండా ఇండిగో ఎయిర్ లైన్స్‌ వెబ్‌సైట్‌లో భద్రత లోపాలున్నట్లు ఎయిర్‌లైన్స్‌కు తెలియజేశాడు. కస్టమర్ కేర్ సేవలు చురుగ్గా ఉండేలా చూడాలని, యాక్టివ్ గా ఉండేలా చూడాలని తెలిపాడు. పలు లోపాల కారణంగా ప్రయాణికుల పూర్తి వివరాలు వెబ్‌సైట్‌ లీక్ చేస్తోందని వెల్లడించాడు. దీనిపై ఇండిగో స్పందిస్తూ, నందన్ కుమార్ కు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. సెక్యూరిటీ  లోపాలు లేకుండా జాగ్రత్త వహిస్తామని హామీ ఇచ్చింది. 

చదవండి: విప్లవాత్మక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆవిష్కరించిన దుబాయ్‌ కంపెనీ..! రేంజ్‌లో కూడా అదుర్స్‌..! 

మరిన్ని వార్తలు