ఎఫ్‌బీలో ఓవర్‌ యాక్షన్‌: బీటెక్‌ విద్యార్థికి జైలు, భారీ జరిమానా

1 Nov, 2022 13:02 IST|Sakshi

బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఫైజ్ రషీద్‌కి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు జడ్జి సిఎం గంగాధర అతనికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించారు.

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ప్రశంసిస్తూ, భారత సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇంజనీరింగ్ విద్యార్థి  రషీద్‌ను  2019 ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు.  అప్పటినుంచి అతనికి బెయిల్ మంజూరు కాలేదు.  విచారణలో తాజాగా కోర్టు తీ ర్పునిచ్చింది.  రషీద్ నిరక్షరాస్యుడు కాదని, కావాలనే ఫేస్‌బుక్‌లో ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారని న్యాయమూర్తి అన్నారు. ఇది జాతికి వ్యతిరేకమైందనీ, హేయమైందని న్యాయమూర్తి గంగాధరను  ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా  రిపోర్ట్‌ చేసింది.

కాగా ఫైజ్‌ ఫేస్‌బుక్ పోస్ట్‌లో, భారత సైనికులపై పుల్వామాలో జరిగిన దాడి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయని ఆరోపించిన పోలీసులు ఫైజ్‌ను అరెస్ట్‌ చేసి, అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2019, ఫిబ్రవరి 24న పుల్వామా దాడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల దాడిలో 40మంది సీఆర్పీఎఫ్  జవాన్లు  ప్రాణాలు  కోల్పోయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు