ఎయిర్‌పాడ్స్‌ మిస్‌, స్మార్ట్‌ ఆటో డ్రైవర్‌ ఏం చేశాడో తెలుసా?

16 Nov, 2022 15:36 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

బెంగళూరు:బెంగళూరుకు చెందిన యువతి ఆటోలో తన ఖరీదైన ఎయిర్‌పాడ్‌లను మర్చిపోయింది. ఆగండాగండి..  అయ్యో...అని అపుడే మీరు ఫిక్స్‌ అయిపోకండి..టెక్నాలజీపై అవగాహన ఉన్న ఆటో డ్రైవర్ చేసిన పని గురించి తెలుసుకుంటే.. శభాష్‌ అంటారు. టెక్ సిటీ బెంగళూరులో స్మార్ట్‌ అండ్‌ టెక్‌సావీ ఆటో డ్రైవర్‌ చేసిన పని ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. (ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్‌! మీరు అంతేనా?తస్మాత్‌ జాగ్రత్త!)

సరే.. సూటిగా విషయంలోకి వచ్చేస్తే...షిడికా అనే యువతి ఆఫీసుకు వెళ్లే హడావిడిలో తన ఎయిర్‌పాడ్‌లను పనికి వెళుతుండగా ఆటోలో  మర్చిపోయింది.  కానీ  కేవలం అరగంటలో తన విలువైన గ్యాడ్జెట్ దొరకడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. దీంతో ఈ విషయాన్నిఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో పోస్ట్‌కి వేలకొద్దీ లైక్స్‌,  కామెంట్స్‌ వచ్చాయి.  జయహో ఆటో డ్రైవర్‌ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (స్పోర్టీ లుక్‌లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!)

ఆటోలో ఖరీదైన గ్యాడ్జెట్ ఎయిర్‌పాడ్స్‌ను గుర్తించిన ఆటో డ్రైవర్ దాని కనెక్ట్‌ చేసి, ఆమె పేరు ఉంటో కనుకున్నాడు. తనకు పేమెంట్‌ చేసిన ఫోన్‌పే ద్వారా నంబరు తెలుసుకుని ఆమెను డ్రాప్‌ చేసిన ప్లేస్‌కొచ్చి, అక్కడి బసెక్యూరిటీకి వాటిని హ్యాండోవర్‌ చేయడంతో కథ సుఖాంతమైందన్నమాట.

మరిన్ని వార్తలు