కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా!

27 Aug, 2023 19:01 IST|Sakshi

విజయవంతమైన వ్యాపారాలన్నీ కూడా కేవలం ఒక్క ఆలోచనతో ప్రారంభమైనవే అనే విషయం అందరికి తెలుసు. ఇలాంటి వ్యాపారాలు భారతదేశంలో కోకొల్లలనే చెప్పాలి. ఇలాంటి కోవకు చెందిన ఒక బిజినెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కాలిఫోర్నియా బుర్రిటో..
అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త 'బెర్ట్ ముల్లర్' (Bert Mueller) భారతదేశంలో పర్యటించడానికి వచ్చి క్విక్ సర్వీస్ రెస్టారెంట్ 'కాలిఫోర్నియా బుర్రిటో' (California Burrito) పేరుతో నిర్మించాడు. ఇతడు ధరమ్ ఖల్సా & గేలాన్ డ్రేపర్‌లతో కలిసి దీనిని స్థాపించాడు.

బుర్రిటో రెస్టారెంట్ బెంగళూరులో ఉంది. దీనిని బుర్రిటో రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో 2010లో ప్రారంభించినట్లు సమాచారం.  నిజానికి వీరు ఇండియాలో మొదట గురుగ్రామ్‌లో రెస్టారెంట్‌ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ చివరకు బెంగళూరులో ప్రారంభించారు. దీనికోసం ముల్లెర్ & డ్రేపర్ స్వయంగా చాలా కష్టపడ్డారు.

చెన్నైకి విస్తరణ..
క్రమంగా బుర్రిటో రెస్టారెంట్ భారతదేశంలో క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 2023 మే నెలలో కాలిఫోర్నియా బుర్రిటో చెన్నైకి విస్తరించింది. ఇప్పుడు దేశం మొత్తం మీద బెంగళూరు మాత్రమే కాకుండా ఢిల్లీ ఎన్‌సిఆర్, హైదరాబాద్ నగరాలలో కూడా ఉన్నట్లు సమాచారం.

బుర్రిటో రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్ అయిన ముల్లర్ అమెరికాలోని మోస్ సౌత్‌వెస్ట్ గ్రిల్‌లో పనిచేశాడు. ది కాలేజ్ ఆఫ్ విలియం అండ్ మేరీ నుంచి ఆర్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. దీనికోసం కుటుంబం, స్నేహితుల నుంచి డబ్బు తీసుకుని తమ ప్రయాణం సాగించి నేడు మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు.

100 స్టోర్‌ల లక్ష్యం..
ప్రస్తుతం కాలిఫోర్నియా మొత్తంలో బుర్రిటో రెస్టారెంట్ 50 కంటే ఎక్కువ లొకేషన్‌లలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ప్రతి సంవత్సరం రూ. 110 కోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. 2025 మార్చి నాటికి కాలిఫోర్నియా బురిటో 100 స్టోర్‌లను కలిగి ఉండాలని బెర్ట్ ముల్లర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు