ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!

22 Dec, 2020 15:35 IST|Sakshi

న్యూఢిల్లీ: మీరు బడ్జెట్ లో మంచి మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మొబైల్ లవర్స్ కోసం క్రిస్మస్ పండుగ సందర్బంగా అమెజాన్‌ సరికొత్త ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా శామ్‌సంగ్, ఒప్పో, నోకియా, ఎల్జీ, వివో వంటి బ్రాండ్‌ల మొబైల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీనికి తోడు మీరు ఐసీఐసీఐ, ఎస్‌బిఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఇఎంఐని కూడా పొందగలరు. హెచ్‌డీఎఫ్‌సి క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొబైల్స్ కొంటె 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ (రూ.1,500) పొందే అవకాశం ఉంది. ఈ సేల్ లో భాగంగా తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ మేము మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 5వందల కోసం 5వేలు పెట్టుబడి పెడుతున్నారా జాగ్రత్త!)  

ఒప్పో ఏ11కే  
ఒప్పో ఏ11కే ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10990. ఇది 6.2-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,230 ఎంఏహెచ్. ఒప్పో ఏ11కే మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.

నోకియా 5.3   
నోకియా 5.3 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.11,999కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16,599. ఇది 6.55-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,000 ఎంఏహెచ్. నోకియా 5.3 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్, మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్11   
శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్11 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.10,000కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999. ఇది 6.4-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది SDM450-F01 ఆక్టో కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5,000 ఎంఏహెచ్. శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్11 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.(చదవండి: రూ.14వేలకే శామ్‌సంగ్ 5జీ మొబైల్)


ఎల్జీ డబ్ల్యూ30 ప్రో                   
ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.12,990కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14,999. ఇది 6.21-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 632  ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,050 ఎంఏహెచ్. ఎల్జీ డబ్ల్యూ30 ప్రో మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.

వివో వై91ఐ          
వివో వై91ఐ ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11,990. ఇది 6.22-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,030 ఎంఏహెచ్. వివో వై91ఐ మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.

రెడ్‌మీ 9 పవర్
రెడ్‌మీ 9 పవర్ మొబైల్ నేడే ఫస్ట్ సేల్ కి వచ్చింది. దీని ధర వచ్చేసి రూ.10,999. ఇది 6.53-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రెడ్‌మీ 9 పవర్ మొబైల్ లో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.


 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు