మీ స్మార్ట్‌ఫోన్‌లో మెమరీ స్టోరేజ్‌ ఫుల్‌ అయ్యిందా..! ఐతే ఇలా ట్రై చేయండి..!

2 Jan, 2022 16:53 IST|Sakshi

మీరు ఒక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తోన్న సమయంలో ‘స్టోరేజ్‌ ఫుల్‌ డిలీట్‌ సమ్‌ ఐటమ్స్‌’ అంటూ మెసేజ్‌ వస్తే వెంటనే మనకు పనికిరాని ఫోటోలను, ఇతర ఫైళ్లను డిలీట్‌ చేస్తాం. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటాం. మీకున్న స్మార్ట్‌ఫోన్‌తోనే మెమరీ స్టోరేజ్‌ సమస్యలను ఈ చిన్న చిట్కాతో తొలగించవచ్చును. 

స్మార్ట్‌ఫోన్‌ మెమరీ స్టోరేజ్‌లో కాకుండా క్లౌడ్‌ స్టోరేజ్‌ యాప్స్‌తో మీకు నచ్చినంతా మెమరీ క్లౌడ్‌లో సేవ్‌ చేసుకోవచ్చును. పలు క్లౌడ్‌ యాప్స్‌ అత్యంత సురక్షితమైనవి, సమర్థవంతమైనవి. మీ డేటాను ఇంటర్నెట్‌ సహయంతో క్లౌడ్‌ స్టోరేజ్‌లో సేవ్‌ చేసుకోవడంతో మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పుడూ..‘ స్టోరేజ్‌ ఫుల్‌ డిలీట్‌ సమ్‌ ఐటమ్స్‌..’ అనే మెసేజ్‌ ఎప్పుడు రాదు. ఇప్పటివరకు వందల్లో క్లౌడ్‌ యాప్స్‌లో అందుబాటులో కలవు. వాటిలో కొన్ని ఉచితంగానే సర్సీస్‌ను అందిస్తున్నాయి. మరికొన్ని యాప్స్‌ కొంత మేర ఫీజును వసూలు చేస్తున్నాయి.  

టాప్‌  క్లౌడ్‌ స్టోరజ్‌ యాప్స్‌ మీ కోసం...
► అమెజాన్ డ్రైవ్
అమెజాన్‌ తీసుకొచ్చిన క్లౌడ్‌ ఆధారిత స్టోరేజ్‌ యాప్‌ అమెజాన్‌ డ్రైవ్‌. అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు వీటి సేవలను పొందవచ్చును. ఫోటోలు,  వీడియోల కోసం అపరిమిత బ్యాకప్‌తో పాటు 5GB ఉచిత నిల్వను అమెజాన్‌ డ్రైవ్‌ యూజర్లకు అందిస్తోంది. మీరు సంవత్సరానికి సుమారు రూ. 700 చెల్లిస్తే అపరిమిత స్టోరేజ్‌ను అప్‌గ్రేడ్‌ కావచ్చు. 

► ఆటోసింక్‌(Autosync)
ఈ యాప్‌ను మెటాకంట్రోల్‌ రూపొందించింది. క్లౌడ్‌ స్టోరేజ్‌ మెనేజర్‌గా ఆటోసింక్‌ ఎంతబాగో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో మీరు గూగుల్‌ డ్రైవ్‌, వన్‌డ్రైవ్‌, డ్రాప్‌ బాక్స్‌, బాక్స్‌, మెగా లాంటి క్లౌడ్‌ యాప్స్‌ను ఒకే దగ్గర కల్పిస్తోంది. అపరిమిత స్టోరేజ్‌ కోసం నెలకు 9.99 (సుమారు రూ. 745)డాలర్లను వసూలు చేస్తోంది. 

► డ్రాప్‌ బాక్స్‌
ఈ యాప్‌ మనలో కొంత మందికి సుపరిచితమే. డ్రాప్‌ బాక్స్‌ ఇప్పటికే చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌ వాడుతున్నారు. ఇది 2జీబీ డేటా వరకు ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌ అప్షన్‌ను అందిస్తోంది.  నెలకు రూ. 12 వందలను చెల్లిస్తే 2టీబీ స్టోరేజ్‌ను ఒకేసారి ఆరుగురు సభ్యులు వాడవచ్చును. 

► గూగుల్‌ డ్రైవ్‌
 ఇది ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా క్లౌడ్‌ స్టోరేజ్‌ సౌకర్యాన్ని గూగుల్‌ అందిస్తోంది. యూజర్లు 15 జీబీ వరకు ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు సుమారు రూ. 150 చెల్లించి 100జీబీ డేటాను క్లౌడ్‌ స్టోరేజ్‌ను పొందవచ్చును. 

► మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌
గూగుల్‌ డ్రైవ్‌ మాదిరి క్లౌడ్‌ స్టోరేజ్‌ విషయంలో మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌ సేవలను మైక్రోసాఫ్ట్‌ అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ అనేది ఒక ప్రముఖ క్లౌడ్ స్టోరేజ్ ఎంపిక. ఎందుకంటే ఇది వివిధ రకాల విండోస్ ఉత్పత్తులతో నేరుగా కలిసిపోతుంది. యూజర్లు 5జీబీ వరకు ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు 6.99 డాలర్లను చెల్లిస్తే 1టీబీ వరకు క్లౌడ్‌ స్టోరేజ్‌ను పొందవచ్చును. వన్‌డ్రైవ్‌తో పాటుగా ఆఫీస్‌365 సేవలను కూడా పొందవచ్చును. 

► నెక్స్ట్‌క్లౌడ్‌
నెక్స్ట్‌క్లౌడ్‌ అనేది విభిన్నమైన  క్లౌడ్ స్టోరేజ్‌ యాప్‌. ఇది రెసిలియోసింక్ యాప్‌ లాగా పని చేస్తుంది.మీ కంప్యూటర్ , మీ ఫోన్ మధ్య ఫైల్‌లను సమకాలీకరించడానికి యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. నెక్స్ట్‌ క్లౌడ్‌ సర్వర్‌లో మీ క్లౌడ్‌ స్టోరేజ్‌ సపరేట్‌గా ఆన్‌లైన్‌లో ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. 

► రెసిలియో సింక్‌
రెసిలియో సింక్‌ (బిట్‌టోరంట్‌ సింక్‌)గా కొత్త మందికి ఈ క్లౌడ్‌ స్టోరేజ్‌ యాప్‌ పరిచయం. స్వంత క్లౌడ్ స్టోరేజీని చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉత్తమమైన క్లౌడ్ స్టోరేజ్ సొల్యూషన్ రెసిలియో సింక్‌. ఇది డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్ మొదలైన క్లౌడ్‌ స్టోరేజ్‌ యాప్స్‌లా పనిచేస్తుంది. మీ స్టోరేజ్‌ను ఈ యాప్‌ను సింక్‌లో ఏర్పాటుచేయడం ద్వారా క్లౌడ్‌లో మీ ఫైల్స్‌ భద్రంగా సేవ్‌ అవుతాయి. 

► ట్రెసోరిట్
ట్రెసోరిట్ అనేది సరికొత్త, ఖరీదైన క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌లో ఒకటి. అయితే, ఈ యాప్‌ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడదు. అప్‌లోడ్ చేయబడిన ప్రతి ఫైల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రైమరీ యూజర్లకు 1 జీబీ వరకు ఉచిత స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు 12.50 డాలర్లను చెల్లించి 500జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ డేటాను ప్రీమియం యూజర్లకు అందిస్తోంది. 

చదవండి: స్మార్ట్‌ ఫోన్‌ ఇండస్ట్రీలో కింగ్‌..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు!

మరిన్ని వార్తలు