15 వేల లోపు కొత్త ఫోన్ కొనాలంటే ఇవే బెస్ట్! 

17 Nov, 2020 16:39 IST|Sakshi

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో పోటీగా మామూలుగా లేదు. తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్స్ గల స్మార్ట్ ఫోన్స్ ని తీసుకు వస్తున్నాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రూ .15 వేల లోపు ధర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ ధర అనేది చాలా మందికి అందుబాటులో ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు కూడా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు రూ. 15,000 లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి, మీడియాటెక్ హెలియో జి80, మరియు మీడియాటెక్ హెలియో జి95 వంటి శక్తివంతమైన ప్రాసెసర్‌లను తీసుకొస్తున్నాయి. మంచి కెమెరా టెక్నాలజీ కూడా ఈ ధరలోనే అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్ లు ఉన్నందున, మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ల‌ను ఎంచుకోవడం అంత సులభం కాదు. అలా ఇటీవ‌లే మార్కెట్లోకి వ‌చ్చిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ల‌పై ఓ లుక్కేద్దాం రండి.. 

రియల్ మీ నార్జో 20..
ఈ మధ్య విడుదలైన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ల‌లో ఇది ఒకటి. త‌క్కువ ధ‌ర‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చింది. రియల్ మీ నార్జో సిరిస్ మొబైల్ ఫొన్లను కొత్తగా మార్కెట్ లొకి తీసుకొచ్చింది. మార్కెట్ లో దీని ధర వచ్చేసి 14,999 రూపాయలుగా ఉంది. 

స్పెసిఫికేషన్స్ 

డిస్ ప్లే 6.50-ఇంచ్, 1080x2400 పిక్సల్స్
ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో జి95
ర్యామ్ 6జీబీ
స్టోరేజ్   64జీబీ
బ్యాటరీ సామర్ధ్యం  4500mAh
ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా 16ఎంపీ
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10
కలర్స్ బ్లాక్ నింజా, వైట్ నైట్
సెన్సర్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / 
మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్


రియల్ మీ 7..
ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ల‌లో వ‌చ్చిన బెస్ట్ ఫోన్ లలో ఇది ఒకటి. త‌క్కువ ధ‌ర‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చింది. రియల్ మీ 7 రియల్ మీ 6తో పోలిస్తే మూడు ప్రధాన మార్పులు చేసింది. అవి ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీలలో మార్పు చేసింది. మార్కెట్ లో దీని ధర వచ్చేసి 14,999 రూపాయలుగా ఉంది. 

స్పెసిఫికేషన్స్ 

డిస్ ప్లే     6.50-ఇంచ్, 1080x2400 పిక్సల్స్
ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో జి95
ర్యామ్ 6జీబీ 
స్టోరేజ్ 64జీబీ
బ్యాటరీ సామర్ధ్యం 5000mAh
ప్రధాన కెమెరా  64ఎంపీ  + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ  
సెల్ఫీ కెమెరా 16ఎంపీ
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10
కలర్స్ మీస్ట్ బ్లూ, మీస్ట్ వైట్ 
సెన్సార్స్ 

ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్

పోకో ఎం 2 ప్రో..
పోకో ఎం 2 ప్రో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండటంతో పాటు రెడ్‌మి నోట్ 9 ప్రోతో సమానంగా కనిపిస్తుంది. పోకోలో 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డి + ఎల్‌సిడి డిస్‌ప్లేను ఉపయోగించారు. పోకో ఫ్రంట్ మరియు వెనుక కెమెరా మాడ్యూల్‌లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు. పోకో M2 ప్రో ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 11 పై నడుస్తుంది. దీనిలో క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 720G SoC చిప్ ని వాడారు. 5,000mAh సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఒక రోజు మొత్తం సులభంగా వాడుకోవచ్చు. దీని ధర వచ్చేసి Rs. 13,999.

స్పెసిఫికేషన్స్ 

డిస్ ప్లే 6.67-ఇంచ్, 1080x2400 పిక్సల్స్
 
ప్రాసెసర్  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి
ర్యామ్ 4జీబీ 
స్టోరేజ్ 64జీబీ
బ్యాటరీ సామర్ధ్యం 5020ఎంఏహెచ్
ప్రధాన కెమెరా 48ఎంపీ  + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా 16ఎంపీ
ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 10 
కలర్స్ బ్లూ, గ్రీన్, బ్లాక్
సెన్సార్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్


రెడ్‌మి నోట్ 9 ప్రో
గతంలో రెడీమి నోట్ సిరీస్ లో వచ్చిన ఫోన్ ల కంటే రెడ్‌మి నోట్ 9 ప్రో తక్కువ ప్రారంభ ధరలో ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో 6.67-అంగుళాల ఎల్‌సిడి స్క్రీన్‌ను కలిగి ఉండటంతో పాటు పైభాగంలో హోల్-పంచ్ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది. దీనిలో కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్ ఉపయోగించారు. రెడ్‌మి నోట్ 9 ప్రో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. దీని ధర వచ్చేసి 12,999 రూపాయలు.  

స్పెసిఫికేషన్స్ 

డిస్ ప్లే   6.67- ఇంచ్, 1080x2400 పిక్సల్స్
ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి 
ర్యామ్ 4జీబీ 
స్టోరేజ్ 64జీబీ 
బ్యాటరీ సామర్ధ్యం 5020ఎంఏహెచ్
ప్రధాన కెమెరా  48ఎంపీ  + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా 16ఎంపీ
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 
కలర్స్   అరోరా బ్లూ, ఛాంపింగ్ గోల్డ్, గ్లేసియర్ వైట్, బ్లాక్
సెన్సార్స్ ఫేస్ అన్‌లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్

రియల్‌ మీ నార్జో 10..
రియల్‌ మీ నార్జో 10 తక్కువ ఖర్చుతో కూడిన ఫోన్, ఇది మీడియాటెక్ హెలియో జి80 SoC ప్రాసెసర్ పై నడుస్తుంది. దీనిలో కూడా  5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీను వాడారు. ఈ మొబైల్ లో 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్‌ పొందవచ్చు. ఇందులో హెలియో జి80 ప్రాసెసర్ ఉపయోగించడం వల్ల గేమింగ్ పనితీరు చాలా బాగుంది. భారత్ లో దీని ధర వచ్చేసి 11,999 రూపాయలు. 

స్పెసిఫికేషన్స్ 

డిస్ ప్లే 6.50-ఇంచ్, 720x1600 పిక్సల్స్
ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో జి80
ర్యామ్  4జీబీ 
స్టోరేజ్ 128జీబీ 
బ్యాటరీ సామర్ధ్యం 5000ఎమ్ఏహెచ్
ప్రధాన కెమెరా 48ఎంపీ  + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా 16ఎంపీ
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10
కలర్స్  గ్రీన్, వైట్ 

మరిన్ని వార్తలు