ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధర రూ. 50,000 లోపు మాత్రమే.. అస్సలు మిస్ అవ్వొద్దు!

9 Apr, 2023 10:55 IST|Sakshi

రద్దీగా ఉండే రోడ్లు, భారీ ట్రాఫిక్‌ జామ్‌ సమయాల్లో కార్లలో ప్రయాణించడం చాలా కష్టం. అందుకే అలాంటి క్లిష్ట సమయాల్లో ప్రయాణం సాఫిగా జరిగేలా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు మొగ్గు చూపుతుంటారు. మీరూ అలా తక్కువ బడ్జెట్‌లో అంటే రూ.50 వేలకే స్కూటర్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? 

ప్రస్తుతం మార్కెట్‌లో బడ్జెట్‌ ధరల్లో స్కూటర్లను అందించేందుకు ఆటోమొబైల్‌ కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకే ఇప్పుడు మనం ధర తక్కువ, మైలేజ్‌, నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తూ ప్రయాణానికి సౌకర్యంగా ఉండే స్కూటర్ల గురించి తెలుసుకుందాం.     

టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ 100 
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టీవీఎస్‌ ‘టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ 100 (TVS XL100)’ పేరుతో 6 మోడళ్లు, 15 రకాల రంగులతో రూ.46,671 నుంచి రూ.57,790 ధరతో స్కూటర్లను అందిస్తుంది. 99పీపీ బీఎస్‌6 ఇంజిన్‌తో 4.4 హార్స్‌ పవర్‌, 6.5 ఎన్‌ఎం టారిక్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెహికల్‌ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని బరువు 89 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 4 లీటర్లు.సైలెంట్ స్టార్టర్, ఇంజిన్ కిల్‌స్విచ్‌, యూఎస్‌బీ ఛార్జింగ్ సపోర్ట్, డేటైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్‌ (డీఆర్‌ఎల్‌)తో వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన వెహికల్స్‌లో ఇదొకటి.  

కొమాకి ఎక్స్‌జీటీ కేఎం
Komaki XGT KM ఎలక్ట్రిక్ స్కూటర్. ఢిల్లీ కేంద్రంగా 35ఏళ్ల నుంచి ఆటోమొబైల్‌ రంగంలో రాణిస్తున్న కేఐబీ కొమాకి సంస్థకు చెందిన ఈ స్కూటర్‌లో అండర్‌సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. హెల్మెట్‌ పెట్టుకునేందుకు వీలుగా స్థలం ఉంది. అదనంగా Komaki XGT KM డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ లాక్ ఇలా అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనపు భద్రత కోసం ముందు చక్రం డిస్క్ బ్రేకులు అమర్చబడ్డాయి. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, XGT KM 130-150కిమీల పరిధిని కవర్ చేయగలదు. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 6-8 గంటలు పడుతుంది.

అవాన్ ఇ లైట్
Avon E Lite దేశీయంగా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో ఇదికొటి. కేవలం రూ. 28,000కి కొనుగోలు చేయొచ్చు. పూర్తి ఛార్జ్ తర్వాత, E లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 50 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఫుల్‌ ఛార్జింగ్‌ చేసేందుకు 4-8 గంటలు పడుతుంది.  

లోహియా ఓమా స్టార్
Lohia Oma Star దేశీయంగా తయారు చేసింది. క్లచ్‌ తక్కువ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సీటు కింద స్టోరేజ్ బాక్స్‌ను కలిగి ఉంది. స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 60 కిమీ/ఛార్జ్ వరకు ప్రయాణించగలదు. దీని ప్రారంభం ధర రూ.41,444 ఉండగా.. ఖరీదైన వేరియంట్‌ ధర రూ.51,750కే కొనుగోలు చేయొచ్చు.  

ఎవాన్‌ ఈ స్కూట్
Avon E Scoot 65 కిమీ/ఛార్జ్ పరిధితో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ.45,000 నుంచి రూ. 50,000 లోపు అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.  

టెక్కో ఎలక్ట్రా నియో
Techo Electra Neo భారత్‌లో తయారైంది. రూ. 41,919 ధరతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. నాలుగు విభిన్న రంగులలో లభిస్తుంది. టెక్కో ఎలెక్ట్రా నియో మోటారు 250 డబ్ల్యూ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్ సుమారు 5-7 గంటలు పడుతుంది.సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్,విశాలమైన స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ వంటి ఇతర సదుపాయాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు