Amazon Prime Day 2021: ఎక్కువగా అమ్ముడైన ఫోన్లు ఇవే

30 Jul, 2021 10:44 IST|Sakshi

అమెజాన్‌ ప్రైమ్‌డేలో మరోసారి మొబైల్‌ఫోన్లు దుమ్ముదులిపాయి. ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఇలా వివిధ కేటరిగిల్లో వేల సంఖ్యలో వస్తువులను అమ్మకానికి పెట్టగా.. జనాలు స్మార్ట్‌ఫోన్లు కొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపించారు. మొత్తం అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్ల వాటానే ఎక్కువగా ఉంది. ఫోన్లప్రై ప్రకటించిన డిస్కౌంట్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్‌గా విడుదలైన ఫోన్లలను ప్రైమ్‌డేలో సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. 

1.26 లక్షల కొనుగోళ్లు
ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 48 గంటల పాటు 'ప్రైమ్‌ డే' సేల్‌ నిర్వహించింది. ఈ స్మాల్‌ మీడియం బిజినెస్‌ మోడల్‌లో డెస్క్‌ట్యాప్‌, ల్యాప్‌ ట్యాప్‌, బ్యూటీ ప్రాడక్ట్‌, దుస్తులు, ఇంట‍్లో ఉపయోగించే సామాగ్రి, స్మార్ట్‌ ఫోన్లతో పాటు వంటగదిలో వినియోగించే వస్తువులు భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగినట్లు అమెజాన్‌ తెలిపింది. రెండురోజుల పాటు జరిగిన ఈ సేల్‌లో ప్రైమ్‌ మెంబర్స్‌ 1.26లక్షల మంది కొనుగోళ్లు చేయగా..31,000 మంది అమ్మకాలు జరిపినట్లు.. ఆ అమ్మకాల్లో  25శాతం మంది పైగా రూ.1కోటి పైగా బిజినెస్‌ నిర్వహించినట్లు అమెజాన్‌ ప్రతినిధులు వెల్లడించారు.


10 నగరాల్లో ప్రధానంగా 
ప్రధానంగా 10నగరాల్లో 70శాతం మంది కొత్త ప్రైమ్‌ మెంబర్స్‌ షాపింగ్‌ చేసినట్లు అమెజాన్‌ చెప్పింది. అందులో ముఖ్యంగా జమ్ము-కాశ్మీర్‌ కు చెందిన అనంతనాగ్‌,జార్ఖండ్ లోని బొకారో, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌, నాగలాండ్‌ లోని మొకోక్చుంగ్, పంజాబ్‌లోని హోషియార్‌పూర్, తమిళనాడులో నీలగిరి, కర్ణాటకలోని గడగ్, కేరళలోని కాసరగోడ్ ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది కొనుగోళ్లు జరిపినట్లు తేలింది.

ఎక్కువ ఏ బ్రాండ్‌ ఫోన్లను కొనుగోలు చేశారంటే
 

అమెజాన్‌ ప్రైమ్‌ డేలో వన్‌ ప్లస్‌ నార్డ్‌2 5జీ, వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ, రెడ్‌ మీ నోట్‌ 10 సిరీస్‌, రెడ్‌మీ 9, శాంసంగ్‌ గెలాక్సీ ఎం 31ఎస్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎం21, రియల్‌మీ సీ11 ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు అమెజాన్‌ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు