Best 5G Mobile Phones Under 20000: రూ.20 వేల లోపు ల‌భించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!

10 Jul, 2022 16:59 IST|Sakshi

టెక్నాలజీ పెరిగే కొద్ది స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు, సరికొత్త హంగులతో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ ఫోన్‌ల విడుదల ఎక్కువైంది. కొనుగోలు దారులు సైతం ఆకట్టుకునే ఫోన్‌లు కళ్లెదురుగా కనిపిస్తుంటే ఏ ఫోన్‌ కొనుగోలు చేయాలో అర్ధం గాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అందుకే పనితీరు బాగుండి.. కెమెరా, బ్యాటరీ, స్మూత్‌ డిస్‌ప్లేతో రూ.20వేలకు మార్కెట్‌లో ఇప్పటికే కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఫోన్‌ల గురించి తెలుసుకుందాం. 

5జీ పోకో ఎక్స్‌4 ప్రో 
రూ.20వేల లోపు బడ్జెట్‌ ధరలో లభ్యమయ్యే ఫోన్‌ల స్థానంలో  పోకో ఎక్స్‌4 ప్రో నిలిచింది. 6.67 అంగుళాలతో ఎఫ్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, ఫాస్ట్‌ ఫర్మామెన్స్‌ కోసం స్నాప్‌ డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌, 5000ఏఎంహెచ్‌ బ్యాటరీ, 67డబ్ల్యూ ఛార్జర్‌, 64 ఎంపీ లెడ్‌ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో లభ్యం అవుతుంది

5జీ రెడ్‌మీ నోట్‌ 11ప్రో 
షావోమీ​కి చెందిన రెడ్‌ మీ నోట్‌ 11ప్రో. దీని ధర రూ.18,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే హేలియా జీ96 చిప్‌ సెట్‌తో రూ.20వేల లోపు బడ్జెట్‌ ధర ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పుకోవచ్చు. ఎందుంటే ఈ ఫోన్‌లో  బీజీఎంఐ,కాల్‌ ఆఫ్‌ డ్యూటీ (సీఓడీ) లాంటి  హై గ్రాఫిక్స్‌  గేమ్స్‌ను ఈజీగా ఆడుకోవచ్చు. అంతేకాదు 6.67 ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, ట్రిపుల్‌ రేట్‌ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను డిజైన్‌ చేశారు. 

5జీ ఐక్యూ జెడ్‌6
రూ.15వేల లోపు బడ్జెట్‌ ఫోన్‌ కోసం చూస్తున్నట్లైతే ఐక్యూ జెడ్‌6 బెస్ట్‌ ఆప్షన్‌ అని మార్కెట్‌ పండితులు చెబుతున్నారు. ఎందుంటే ఇందులో ఆండ్రాయిడ్‌ 12 ఎక్స్‌పీరియన్స్‌, బ్యాటరీ లైఫ్‌, కెమెరా పనితీరు బాగుండటమే కాదు.. స్నాప్‌ డ్రాగన్‌ 696 చిప్‌సెట్‌తో వస్తుంది.  50 ఎంపీ,2ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌తో డిజైన్‌ చేసింది ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.14,999గా ఉంది. 

5జీ రియల్‌ మీ 9ప్రో
రియల్‌ మీ 9ప్రోలో క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌, 6.6 అంగుళాల డిస్‌ప్లే,120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ,33 డబ్ల్యూ ఛార్జర్‌, 64ఎంపీ నైట్‌ స్కేప్‌ కెమెరా, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో పాటు 2 ఎంపీ మైక్రో లెన్స్‌తో అందుబాటులో ఉంది. 

మోటోజీ52
మోటరోలా మోటో జీ 52 సూపర్‌ డిస్ల్‌ప్లే, స్నాప్‌ డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌, 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అండ్‌ 2ఎంపీ సెన్సార్‌లతో ఈ ఫోన్‌ రూ.14,999కే లభ్యమవుతుంది.

మరిన్ని వార్తలు